OnePlus 13 phone: One plus మొబైల్ కొని లవర్స్ కు ఆ కంపెనీ కొత్త సంవత్సరం సందర్భంగా శుభవార్త తెలిపింది. ఇప్పటివరకు ఈ కంపెనీ ఫోన్లో ప్రీమియం తరహాలో ఉండి అత్యధిక ధరను కలిగి ఉండేవి. అయితే 2026 న్యూ ఇయర్ సందర్భంగా ఓ ఫోన్ పై భారీగా తగ్గింపును ప్రకటించింది. ఏకంగా రూ.6,000 తగ్గింపు ప్రకటించడంతో చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా మరికొంత డిస్కౌంట్ రావడంతో చాలామంది దీనిని కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇంతకీ ఈ ఫోన్ ధర ఎంత? అందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
One plus 13 మొబైల్ ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే దీనిని కొనాలంటే కొంతమందికి బడ్జెట్ సరిపోయేది కాదు. కానీ పండుగ సందర్భంగా దీనిపై భారీ తగ్గింపును ప్రకటించింది. ముందుగా ఈ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో చూద్దాం. ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే వేరే 11 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో 6.8 అంగుళాల 120 Hz QXD+డిస్ప్లే ను సెట్ చేశారు. ఇది డాల్బీ విజన్ సపోర్టుతో పని చేస్తుంది. ఈ డిస్ప్లేలో నాణ్యమైన వీడియోలను వీక్షించవచ్చు. గేమింగ్ కోరుకునే వారికి ఇది అనుగుణంగా ఉంటుంది. అలాగే ఈ మొబైల్ చుట్టూ ప్రీమియం డిజైన్ కనిపిస్తుంది. వెనుక వైపు లెదర్ ప్యాక్ ప్యానెల్ తో కప్పబడి ఉంటుంది. మొత్తంగా చూడడానికి ఆకర్షణంగా ఉంటుంది.
ఈ మొబైల్ బ్యాటరీ మెరుగైందని ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఇందులో 6,000 mAh బ్యాటరీ ని అమర్చారు. దీంతో రోజువారి వినియోగదారులకు ఇది అనుగుణంగా ఉంటుంది. అలాగే మల్టీ టాస్కింగ్ యూస్ చేసే వారికి కూడా సపోర్ట్ ఇస్తుంది. ఒకసారి చార్జింగ్ చేస్తే రోజంతా గంటల పాటు వినియోగించినా కూడా చార్జింగ్ దిగే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే డౌన్ టైం కూడా తక్కువగా ఉండడంతో అన్ని రకాల వారికి అనుగుణంగా ఉంటుంది. ఈ మొబైల్లో బయోమెట్రిక్, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్స్ వంటి ఫీచర్లు స్మూత్ గా కొనసాగించుకోవచ్చు.
వన్ ప్లస్ 13 మొబైల్ కెమెరా ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోరుకునే వారికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో 50 MP LYT 808 మెయిన్ కెమెరాను అమర్చారు. ఇది ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న one plus 12 కంటే అప్డేట్ అయ్యింది. అలాగే టెలిఫోటో, అల్ట్రా వైడ్ సెన్సార్ లు 50 MP తో పనిచేస్తాయి. ఈ రెండు కెమెరాలు కలిసి నాణ్యమైన ఫోటోలను అందిస్తాయి. 4k వీడియోలు కోరుకునే వారికి కూడా ఈ కెమెరా సపోర్ట్ గా ఉంటుంది.
ఇప్పటివరకు ఈ మొబైల్ మార్కెట్లో రూ.69,999 తో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం రూ.63,999 కె అందిస్తున్నారు. అంటే దీనిపై రూ.6,000 వరకు వస్తుంది. అలాగే HDFC బ్యాంకు కార్డులపై మరో రూ.4,000 తగ్గింపులు పొందవచ్చు.