SL vs PAK: ఫిబ్రవరి నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు తన ప్లేయర్ల జాబితాను ప్రకటించాయి. ఇటువంటి వరల్డ్ కప్ కోసం సాధన కూడా మొదలుపెట్టాయి. ఇంగ్లాండ్ జట్టుతో యాషెస్ సిరీస్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా రంగంలోకి వస్తుంది.. భారత్ స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో వన్డే, టీ 20 సిరీస్ ఆడుతుంది.. మన పక్కనే ఉన్న శ్రీలంక, పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ ఆడుతున్నాయి. ఇక మిగతా జట్లు కూడా వారి షెడ్యూల్ ప్రకారం టోర్నీలు ఆడతాయి.
టి20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు పాకిస్తాన్, శ్రీలంక మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ లో తల పడబోతున్నాయి. తొలి మ్యాచ్ నేడు దంబుల్లా వేదికగా మొదలుకానుంది. సాయంత్రం ఏడు గంటల 30 నిమిషాల నుంచి ఈ మ్యాచ్ ప్రసారమవుతుంది. మూడు టి20 మ్యాచ్ల సిరీస్ ను రెండు జట్లు టి20 వరల్డ్ కప్ కోసం సన్నాహకంగా భావిస్తున్నాయి. పాకిస్తాన్ శ్రీలంకలోనే టి20 వరల్డ్ కప్ లో మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో ఆ జట్టు అడుగు పెట్టదు కాబట్టి.. శ్రీలంకలోనే తన టి20 వరల్డ్ కప్ సమరాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ కూడా పాకిస్తాన్లో కాకుండా, దుబాయిలో తన మ్యాచ్ లు మొత్తం ఆడింది.
పాకిస్తాన్ జట్టు, శ్రీలంక జట్టు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ సిరీస్లో.. పోరు హోరాహోరీగా ఉంటుందని కొన్ని చానల్స్.. ఏకపక్షంగా ఉంటుందని మరికొన్ని చానల్స్ వార్తలను ప్రసారం చేస్తున్నాయి. సొంత మైదానం కావడంతో శ్రీలంక ప్లేయర్లు అడ్వాంటేజ్ తీసుకుంటారని.. పాకిస్తాన్ ప్లేయర్లకు చుక్కలు చూపిస్తారని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. పాకిస్తాన్ జట్టుకు సల్మాన్ అఘా నాయకత్వం వహిస్తున్నాడు.. నపే, ఫకర్ జమాన్, అబ్దుల్ సమద్, అయుబ్, అష్రఫ్, నవాజ్, షాదాబ్ ఖాన్, ఫర్హాన్, అబ్రార్ అహ్మద్, మహమ్మద్ వసీం జూనియర్, ఉస్మాన్ తారీక్ వంటి వారితో పాకిస్తాన్ జట్టు బరిలోకి దిగుతోంది.
శ్రీలంక జట్టుకు షనక సారధ్యం వహిస్తున్నాడు. ధనుంజయ డిసిల్వా, అసలంక, లియానేజ్, కమిండు మెండిస్, వానిందు హసరంగ, వెల్ల లాగే, మహేష్ తీక్షణ, చమీరా, తుషార, పతిరణ, ఎశాన్ మలింగ వంటి ప్లేయర్లతో శ్రీలంక జట్టు బరిలోకి దిగుతోంది.