https://oktelugu.com/

Bhale Unnade Movie Review: భలే ఉన్నాడే ఫుల్ మూవీ రివ్యూ…

వైజాగ్ ప్రాంతంలో ఒక కుర్రాడు ఉంటాడు. ఇక ఈయన శారీ డ్రైపర్ (అమ్మాయిలకు శారీ కట్టడం) గా వర్క్ చేస్తుంటాడు. ఇక వాళ్ల అమ్మ గౌరీ ఒక బ్యాంకు లో పని చేస్తూ ఉంటుంది. ఇక అదే బ్యాంకులో కృష్ణ అనే అమ్మాయి కూడా పనిచేస్తూ ఉంటుంది.

Written By:
  • Gopi
  • , Updated On : September 13, 2024 / 03:36 PM IST

    Bhale Unnade Movie Review

    Follow us on

    Bhale Unnade Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి మూడు సినిమాలతో మంచి విజయాలను అందుకున్న రాజ్ తరుణ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక మొదట్లో మంచి విజయాలను అందుకున్నప్పటికి ఆ తర్వాత మాత్రం ఆయన అసలు సక్సెస్ లను అందుకోలేకపోతున్నాడు. కారణం ఏంటి అనేది పక్కన పెడితే ఈ మధ్య ఆయన పర్సనల్ లైఫ్ లో కూడా ఆయన వార్తల్లో నిలుస్తున్నాడు. ఇక మొత్తానికైతే ఆయన చేసిన ‘భలే ఉన్నాడే’ అనే సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక మొత్తానికైతే ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…

    కథ

    వైజాగ్ ప్రాంతంలో ఒక కుర్రాడు ఉంటాడు. ఇక ఈయన శారీ డ్రైపర్ (అమ్మాయిలకు శారీ కట్టడం) గా వర్క్ చేస్తుంటాడు. ఇక వాళ్ల అమ్మ గౌరీ ఒక బ్యాంకు లో పని చేస్తూ ఉంటుంది. ఇక అదే బ్యాంకులో కృష్ణ అనే అమ్మాయి కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇక దాని ద్వారా గౌరీ గారు తీసుకొచ్చే టిఫిన్ బాక్స్ ని రోజు కృష్ణ తింటూ ఉంటుంది. ఆ వంట తనకు బాగా నచ్చడంతో గౌరీ కొడుకు అయిన రాధా మీద తెలియకుండానే కృష్ణ కి ఇష్టం పెరుగుతుంది…అలాగే వాళ్ళ అమ్మ గౌరీ ద్వారా కృష్ణ రాధాకు కూడా పరిచయం అవుతుంది. ఇక వీళ్లిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడి అది ప్రేమగా మారుతుంది. మొత్తానికైతే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యి పెద్దలను ఒప్పించి మరి పెళ్లికి సిద్ధమవ్వగా అప్పుడే హీరో వైఖరి మీద హీరోయిన్ ఫ్రెండ్ ఒక డౌట్ ని క్రియేట్ చేస్తుంది. దాని ద్వారా కృష్ణ కి రాధ మీద ఒక డౌట్ క్రియేట్ అయి ఆయన పెళ్లి కి పనికి వస్తాడా లేదా అనే ఒక పరీక్ష కి సిద్ధమవుతుంది. మరి వీళ్ళ మధ్య ఏం జరిగింది.? వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారా లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

    విశ్లేషణ

    డైరెక్టర్ శివ సాయి వర్ధన్ ఎంచుకున్న పాయింట్ బాగానే ఉన్నప్పటికీ దాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో మాత్రం ఆయన కొంతవరకు తలబడ్డాడనే చెప్పాలి. ఎందుకంటే ఒక సెన్సిటివ్ పాయింట్ ని డీల్ చేస్తున్న క్రమంలో మనం ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నావు అనే పాయింట్ ను హుక్ చేసుకొని దాని మీదే స్టిక్ అవుతుంది. ప్రేక్షకులకు ప్రతి పాయింట్ ను ఇంజక్ట్ చేసే ప్రయత్నం అయితే చేయాలి. ఇక ఇలాంటి కథ నేర్చుకున్నప్పుడు ఏమాత్రం ఇబ్బంది జరిగినా కూడా సినిమా మొదటికే మోసం వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఎలాగైనా సరే వాళ్ళు సినిమా మీద క్లారిటీ అనేది మెయింటేన్ చేస్తూ ఉండాలి… అక్కడక్కడ కామెడీతో సాగినప్పటికీ ఓవరాల్ గా మాత్రం ఈ సినిమా లో ఎమోషనల్ సీన్స్ అంత స్ట్రాంగ్ గా వర్కౌట్ కాలేదనే చెప్పాలి…ఇక శేఖర్ చేంద్ర ఇచ్చిన మ్యూజిక్ పక్కన పెడితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంత బాగా లేదు. ఎమోషనల్ సీన్స్ ను హ్యాండిల్ చేయడం లో దర్శకుడు గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గానీ ఏ మాత్రం ఎఫెక్టివ్ గా లేదనే చెప్పాలి…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే రాజ్ తరుణ్ ఈ సినిమాలో ఒక సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చినప్పటికి ఆయన కొన్ని సీన్స్ లో ఇంకా బాగా చేసి ఉండచ్చు అనిపిస్తుంది.ఇక హీరోయిన్ మనీషా కూడా తన క్యారెక్టర్ లో నటించి మెప్పించింది. ఇక అభిరామి, గోపరాజు రమణ, హైపర్ ఆది, శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి నటి నటులు కూడా చాలా వరకు వాళ్ల పాత్రల్లో ఒదిగిపోయి నటించారు…నిజానికి ఇంకా కొంత మంది ఆర్టిస్టులు ఉన్నప్పటికీ వాళ్ళను సరైన రీతిలో వాడుకోలేదు…

    టెక్నికల్ అంశాలు

    ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమా కి మ్యూజిక్ అందించిన శేఖర్ చంద్ర అంత గొప్ప మ్యూజిక్ అయితే ఇవ్వలేకపోయాడు. కారణం ఏదైనా కూడా ఈ సినిమాకి మ్యూజిక్ అనేది చాలా వరకు మైనస్ గా మారింది…ఇక సినిమాటోగ్రఫీ కొంతవరకు ఒకే అనిపించేలా ఉంది…ఎడిటర్ మాత్రం తన పనిని ఆయన పర్ఫెక్ట్ గా చేయలేదు…ఇక ఇంటర్వెల్ కి ముందు కొన్ని సీన్స్ లాగ్ అయ్యాయి. వాటిని షార్ప్ ఎడిటింగ్ చేసి ఉంటే బాగుంటుంది…అందువల్లే ఈ సినిమా అన్ని క్రాఫ్టు లలో కూడా తన వర్క్ ను అంత బాగా చేయలేకపోయారనే చెప్పాలి…

    ప్లస్ పాయింట్స్

    కథ
    కొన్ని కామెడీ సీన్స్

    మైనస్ పాయింట్స్

    స్క్రీన్ ప్లే
    డైరెక్షన్
    కొన్ని సీన్స్ లలో ఆర్టిస్టుల పర్ఫామెన్స్ అంత బాగా లేదు…

    రేటింగ్

    ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2/5

    చివరి లైన్
    భలే ఉన్నాడే అంత బాగా లేదు…