Chiranjeevi : ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీ విని ఎరుగని రీతిలో చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు… ఇక దానికి తగ్గట్టుగానే వాళ్ళు చేయబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధించబోతున్నారనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.. చాలా మంది స్టార్ డైరెక్టర్లుగా ఎదగాలంటే స్టార్ హీరోలతో సినిమాలు చేయాల్సిన అవసరమైతే ఉంది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.. దాదాపు 45 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీ ని ఆయన ఏకఛత్రాదిపత్యంతో ఏలుతున్నాడనే చెప్పాలి…
సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తీసింది ఒక్క సినిమా అయినప్పటికి చిరంజీవితో సినిమాని అనౌన్స్ చేయడంతో ఆయన పేరు ఇండస్ట్రీలో మారు మ్రోగిపోతుందనే చెప్పాలి. మరి అలాంటి దర్శకుడు మరోసారి నాని తో ‘ప్యారడైజ్ ‘ అనే సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా ఆయన చిరంజీవితో చేయబోయే సినిమాకి ఎలాంటి ఫామ్ లో ఉండబోతున్నాడనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి శ్రీకాంత్ ఓదెల లాంటి యంగ్ డైరెక్టర్స్ కి అవకాశం ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటి అంటే దసర సినిమాలో శ్రీకాంత్ ఓదెల చేసిన మాస్ ఎలిమెంట్స్ బాగా నచ్చాయట. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ ను తీర్చిదిద్దిన విధానం అయితే చిరంజీవికి బాగా నచ్చిందట. దానివల్ల ఈ సినిమాని ఒకటికి రెండుసార్లు చిరంజీవి చూసారట. ఇక దాంతో చిరంజీవి శ్రీకాంత్ తో మంచి కథ ఉంటే చెప్పమని చెప్పాడట…
అందువల్లే శ్రీకాంత్ ఓదెల చిరంజీవికి కథను చెప్పి అతని చేత సినిమాని చేయించుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధిస్తేనే శ్రీకాంత్ ఓదెల టాప్ డైరెక్టర్ లిస్టులో చేరుతాడు. ఇక చిరంజీవి కూడా ఈ సినిమాతో భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటి వరకు చిరంజీవి చేయనటువంటి ఒక కొత్త క్యారెక్టర్ లో చిరంజీవిని చూపించడానికి తను సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.
మరి అన్ని అనుకున్నట్టుగా కుదిరితే మాత్రం శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోగలిగే శ్రీకాంత్ ఓదెల ఇకముందు చేయబోయే సినిమాలతో పెను ప్రభంజనాలను సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. చిరంజీవి కూడా శ్రీకాంత్ ఓదెలకు పూర్తి సహకారం అందిస్తూ ఆయన ఎలాంటి కథ అయితే చెప్పాడో ఆ మూడ్ చెడగొట్టకుండా చిరంజీవి నటించబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక మొత్తానికైతే శ్రీకాంత్ ఓదెల ఇకమీదట స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడనే చెప్పాలి… ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు. మరి దానికి తగ్గట్టుగానే వాళ్ళు తమ సినిమాలతో సూపర్ సక్సెస్ సాధిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…