Pushpa 2 Collection: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రం విజయవంతంగా 6 రోజులు పూర్తి చేసుకుంది. ఈ ఆరు రోజుల్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన బీభత్సం సాధారణమైనది కాదు. ఒక్కో రోజు ఒక్కో మైలు రాయిని దాటుకుంటూ ఏళ్ళ తరబడి బాక్స్ ఆఫీస్ ట్రేడ్ ని పరిశీలిస్తున్న ట్రేడ్ పండితులకు కూడా మైండ్ బ్లాక్ అయ్యేంత పని చేసింది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఇది వరకు కనీవినీ ఎరుగని రికార్డ్స్ ని నెలకొల్పింది. ఖాన్స్ కి కూడా ఈ రికార్డ్స్ ని కొట్టడం కష్టమే. అలాంటి వసూళ్లను నమోదు చేసింది. 5వ రోజు 48 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను బాలీవుడ్ లో రాబట్టిన ఈ సినిమా, 6వ రోజు 40 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఓవరాల్ గా ఆరు రోజులకు ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ప్రాంతాల వారీగా ఇప్పుడు మనం చూద్దాము.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 155 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 230 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఒక్క నైజాం ప్రాంతంలోనే 71 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించడం ఒక సంచలనం గా చెప్తున్నారు ట్రేడ్ పండితులు. అదే విధంగా బాలీవుడ్ లో ఈ చిత్రానికి ఆరు రోజులకు గానూ 370 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు, 450 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు. అదే విధంగా కర్ణాటక 57 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, తమిళనాడు లో 53 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. ఇక కేరళ విషయానికి వస్తే, ఇప్పటి వరకు 18 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చినట్టు తెలుస్తుంది. అన్ని ప్రాంతాల్లో ఈ వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే అవకాశం ఉన్న ఈ సినిమాకి కేరళలో మాత్రం డిజాస్టర్ స్టేటస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఎందుకంటే ఆ ప్రాంతం లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 60 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రావాలి. కానీ ఇప్పటి వరకు అక్కడ కేవలం 7 కోట్ల రూపాయిల షేర్ మాత్రమే వచ్చిందట. ఇక ఓవర్సీస్ లో ఈ చిత్రానికి 173 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 981 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు ఆరు రోజుల్లో వచ్చాయని, నేడు ఫస్ట్ షోస్ తో ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి అడుగుపెట్టి, ఆల్ టైం ఫాస్టెస్ట్ వెయ్యి కోట్ల సినిమాగా నిలుస్తుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. మరి భవిష్యత్తులో ఈ సినిమా రెండు వేల కోట్ల మార్కుని అందుకుంటుందా లేదా అనేది చూడాలి.