Chiranjeevi and Kamal Haasan : సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజు (Loksesh Kanaka Raj)…ఆయన చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి చాలా మంచి క్రేజ్ అయితే సంపాదించుకున్నాడు. ఇక కమల్ హాసన్ (Kamal Hasan) తో చేసిన విక్రమ్ (vikram) సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడంతో ఆయన ఓవర్ నైట్ లో స్టార్ట్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక ప్రస్తుతం ఆయన రజనీకాంత్ ను హీరోగా పెట్టి ‘కూలీ’ (Cooli) అనే సినిమా చేస్తున్నాడు…ఇక ఆగస్టు 14వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న లోకేష్…ఈ సినిమా తర్వాత భారీ మల్టీస్టారర్ సినిమాని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చిరంజీవి లాంటి దిగ్గజ నటులతో భారీ మల్టీ స్టారర్ సినిమా చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో తను ఉన్నాడు. మరి తను అనుకున్నట్టుగానే వాళ్ళిద్దరి ఇమేజ్ కి తగ్గట్టుగా మంచి కథను రెడీ చేసి ఇద్దరికి వినిపించారట. మరి వాళ్ళిద్దరూ ఈ సినిమా కథకి ఓకే చెప్పారు. తొందరలోనే ఈ సినిమా కూడా సెట్స్ మీదకి రాబోతుంది అంటూ తమిళ్ మీడియాలో కొన్ని కథనాలైతే వెలువడుతున్నాయి.
Also Read : కమల్ హాసన్ డైరెక్షన్ లో చిరంజీవి ఒక సినిమా చేయాలనుకున్నాడా..? మరి ఎలా మిస్ అయింది…
మరి చిరంజీవి అయితే ఇప్పటివరకు అనిల్ రావిపూడి సినిమాతో పాటు, శ్రీకాంత్ ఓదెల సినిమాలను మాత్రమే కన్ఫర్మ్ చేశాడు. ఇక మిగతా ఏ సినిమాని కూడా కన్ఫర్మ్ చేయలేదు. మరి ఇలాంటి సందర్భంలో లోకేష్ కనకరాజు చిరంజీవికి కథను వినిపించాడా? ఒకవేళ వినిపిస్తే ఆయన ఏది చెప్పకుండా హోల్డ్ లో పెట్టాడా ఏంటి అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక లోకేష్ కనకరాజు కూలీ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించి వెయ్యి కోట్లకు పైన కలెక్షన్లను రాబడతానంటూ తన స్నేహితుల దగ్గర చెబుతున్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ కలెక్షన్స్ ని కొల్లగొడితే మాత్రం తన తదుపరి సినిమా మీద భారీ హైప్ అయితే ఉంటుంది.
అందుకే చిరంజీవి కమల్ హాసన్ లను హీరోలుగా పెట్టుకొని భారీ మల్టీ స్టారర్ సినిమాని తెరకెక్కించాలనే ఉద్దేశ్యం లో తను ఉన్నారట. ఇక ఈ సినిమా తర్వాత ఖైదీ 2( Khaidi 2), విక్రమ్ 2 (Vikram 2) సినిమాలను కూడా తెరకెక్కించడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : రజినీకాంత్, చిరంజీవి, కమల్ హాసన్ లకు పాలిటిక్స్ కలిసి రాలేదు…మరి విజయ్ పరిస్థితి ఏంటి..?