https://oktelugu.com/

Ram Charan : రామ్ చరణ్ ఎందుకు ఆర్ట్ సినిమాలు చేయకపోవడానికి కారణం ఎవరు..?

రామ్ చరణ్ లాంటి నటులు ఇండస్ట్రీ లో చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే ఆయన మనం ఎలాంటి సినిమాలు చేస్తున్నాం. అందులో మన యాక్టింగ్ ఎలా ఉండాలి అనే దాని మీద ఎక్కువ కేర్ తీసుకుంటాడు...

Written By:
  • Gopi
  • , Updated On : September 24, 2024 / 07:09 PM IST

    Ram charan

    Follow us on

    Ram Charan :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఆయనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతలా పేరు ప్రఖ్యాతాలను సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాల పట్ల సగటు ప్రేక్షకులు కూడా వాళ్ల అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేసిన త్రిబుల్ ఆర్ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను అలరించడమే కాకుండా గ్లోబల్ స్టార్ గా కూడా ఆయనకు ఒక మంచి బిరుదును తీసుకొచ్చి పెట్టింది. ముఖ్యంగా రామ్ చరణ్ అనగానే మనకు మగధీర, రంగస్థలం, త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఈ మూడు సినిమాలతో ఆయన ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాడనే చెప్పాలి. ఇక మొత్తానికైతే తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. అందుకే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే మొదటినుంచి కూడా కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఇక ధృవ సినిమా నుంచి ఆయన పంథా మార్చి ప్రయోగాత్మకమైన సినిమాలు కూడా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయనకు మంచి సక్సెసులు అయితే దక్కుతున్నాయి.

    మరి ఇలాంటి సందర్భంలోనే రామ్ చరణ్ ఎప్పుడు కమర్షియల్ సినిమాలు, ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తున్నాడు. కానీ ఆర్ట్ సినిమాలు మాత్రం ఎందుకు చేయడం లేదు అని ఒక వర్గం ప్రేక్షకులు రామ్ చరణ్ గురించి కొన్ని నెగిటివ్ కామెంట్లైతే చేస్తున్నారు. నిజానికి రామ్ చరణ్ కి ఆర్ట్ సినిమాను చేసి సక్సెస్ ఫుల్ గా నిలిపేంత సత్తా లేదా? ఎందుకు ఆయన అలాంటి సినిమాల వైపు మొగ్గు చూపించడం లేదు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

    నిజానికి చిరంజీవి లాంటి స్టార్ హీరో కూడా రుద్రవీణ, ఆపద్బాంధవుడు, స్వయంకృషి లాంటి ఆర్ట్ సినిమాలను చేసి మంచి విజయాలను అందుకున్నారు. కానీ రామ్ చరణ్ మాత్రం అలాంటి సినిమాల వైపు మొగ్గు చూపించడం లేదనేది ఇప్పుడు అందరి వాదన… నిజానికి ఒకప్పుడు ఆర్ట్ సినిమాలు ప్రేక్షకుల మీద ఎక్కువగా ప్రభావం చూపించాయి. కానీ ఇప్పుడు ఆర్ట్ సినిమాలను ఆదరించే ప్రేక్షకుల సంఖ్య తగ్గింది. దానివల్లే అలాంటి సినిమాలు చేయడం లేదని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

    ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి రామ్ చరణ్ కి ఆర్ట్ సినిమాలు చేయవద్దని, మాస్ కమర్షియల్ సినిమాలను చేసి ప్రయోగాత్మకమైన సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగాలని చెప్పినట్టుగా కూడా కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా రామ్ చరణ్ పాన్ ఇండియాలో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగడం అనేది ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరిని ఆనందపడేలా చేస్తుంది…