Bank locker : బ్యాంకు లాకర్లో డబ్బు దాస్తున్నారా? అయితే మీరు నష్టపోయినట్లే..

సామాన్యుల నుంచి బడా వ్యాపారుల వరకు అంతా కరెన్సీతో కాకుండా ఆన్ లైన్ ట్రాన్జాక్షన్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఉన్న కరెన్సీని కాపాడుకోవడానికి లాకర్లలో దాచిపెడుతున్నారు. కానీ ఇలా లాకర్లలో డబ్బు దాయడం వల్ల నష్టమే కానీ లభం ఉండదు. అదెలాగో తెలుసుకోండి..

Written By: Srinivas, Updated On : September 24, 2024 6:12 pm

Bank Locker rules

Follow us on

Bank locker : ప్రతిరోజూ ఏదో ఒక పని కావడానికి డబ్బు ప్రధానంగా నిలుస్తుంది. కూరగాయల కొనుగోలు నుంచి పెద్ద పెద్ద వ్యాపారలు చేసేవారి మధ్య నగదు ప్రవాహం అధికంగా ఉంటుంది. ఒకప్పుడు వస్తు మార్పిడి ద్వారా జీవితాలను కొనసాగించేవారు. ఆ తరువాత కరెన్సీ అందుబాటులోకి వచ్చింది. కాలం మారుతున్న కొద్దీ కొత్త కొత్త కరెన్సీ అందుబాటులోకి వచ్చింది. అయితే గత ఏడేళ్లుగా డిజిటల్ ట్రాన్జాక్షన్ డెవలప్ అవుతూ వస్తోంది. సామాన్యుల నుంచి బడా వ్యాపారుల వరకు అంతా కరెన్సీతో కాకుండా ఆన్ లైన్ ట్రాన్జాక్షన్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఉన్న కరెన్సీని కాపాడుకోవడానికి లాకర్లలో దాచిపెడుతున్నారు. కానీ ఇలా లాకర్లలో డబ్బు దాయడం వల్ల నష్టమే కానీ లభం ఉండదు. అదెలాగో తెలుసుకోండి..

సాధారణంగా డబ్బు ఉంటే దానిని బ్యాంకులో డిపాజిట్ చేస్తాం.. ఏవైనా ఆభరణాలు ఉంటే వాటిని ఇంట్లో పెట్టుకోవడ వల్ల దొంగల బెడద ఎక్కువగా ఉంటుంది. దీంతో చాలా మంది బ్యాంకు లాకర్లలో వీటిని భద్రపరుచుకుంటారు. అయితే కొందరు అత్యుత్సాహంతో ఆభరణాలతో పాటు నగదు, ముఖ్యమైన డాక్యుమెంట్లను కూడా లాకర్లలో ఉంచుకుంటారు. ఇవి లాకర్లలో ఉండడం వల్ల సేఫ్ గా ఉంటాయని భావిస్తారు. కానీ బ్యాంకు ఆభరణాల విషయంలో మాత్రమే గ్యారంటీ ఇవ్వగలదు. నగదు, డాక్యుమెంట్ల విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేదు.

బ్యాంకు రూల్స్ ప్రకారం.. లాకర్లలో ఆభరణాలు దాచుకుంటే అవి అగ్ని ప్రమాదం వల్ల లేదా దొంగల వల్ల నష్టం జరిగితే వాటికి బ్యాంకు హామీ ఇస్తుంది. వీటిలో ఏదైనా నష్టం జరిగితే బ్యాంకు లాకర్ అద్దె కు 100 రేట్లు ఎక్కువతో మొత్తాన్ని ఖాతాదారులకు ఇస్తుంది. కానీ బ్యాంకు లాకర్లలో నగదును లేదా విలువైన డాక్యుమెంట్లను భద్రపరుచుకోవడం వల్ల ఎలాంటి హామీ ఇవ్వదు. ఇవి చెదల వల్ల, ఎలుకల వల్ల పాడైపోయినా బ్యాంకుకు సంబంధం ఉండదు.

అందువల్ల బ్యాంకు లాకర్లలో ఆభరణాలు తప్ప ఎలాంటి డాక్యుమెంట్స్, నగదును అస్సలు దాచుకోవద్దు. ఒకవేళ నగదును దాచుకోవాలంటే బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి ఇలా చేస్తారు. కానీ దీని వల్ల ఎక్కువగా నష్టపోతారని గుర్తించరు. అయితే బ్యాంకు లాకర్లలో ఆభరణాలు భద్రపరుచుకోవాలన్నా.. ఆయా బ్యాంకు గురించి పూర్తిగా తెలుసుకోవాలి. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు నష్టాల ఊబిలో చిక్కుకోవడం వల్ల ఆ ప్రభావం ఖాతాదారులపై కూడా పడే అవకాశం ఉంది.

బ్యాంకు లాకర్లలో ఆభరణాలు సేవ్ చేయడపై వివిధ భ్యాంకులు వివిధ రెంట్లను నిర్ణయించాయి. కొన్ని బ్యాంకులు తక్కువ రెంట్ తోనే లాకర్ల సదుపాయం ఇస్తున్నాయి. మరికొన్నింటిలో లాకర్లు డిపాజిట్ చేసుకోవడంతో పాటు వీటిపై కావాలంటే రుణ సదుపాయం కూడా ఇస్తాయి. అయితే ఆభరణాలపై రుణం మిగతా వాటికంటే తక్కువగా ఉంటుంది. ఏదైనా అత్యవసరం ఉండి లేదా ఇతర చోట్ల ఎక్కువ వడ్డీకి అప్పు ఉన్నట్లయితే ఈ ఆభరణాల ద్వారా రుణం తీసుకోవచ్చు. అయితే ఈ రుణంపై విధించే వడ్డీ గురించి ముందే తెలుసుకోవడం ఉత్తమం.