https://oktelugu.com/

సీఎం పాత్రలో చిరంజీవి.. కథ రెడీ.. కానీ..?

మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. రీఎంట్రీలోనూ ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే సీఎం పాత్రలో మాత్రం చిరంజీవి కనబడలేదు. అయితే మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ మెగాస్టార్ ను సీఎం పాత్రలో చూపించడానికి అద్భుతమైన కథను తయారు చేశారట. ఆ కథను చిరంజీవికి వినిపించగా ఆయనకు కూడా కథ నచ్చిందట. అయితే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 21, 2020 11:11 am
    Follow us on

    మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. రీఎంట్రీలోనూ ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే సీఎం పాత్రలో మాత్రం చిరంజీవి కనబడలేదు. అయితే మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ మెగాస్టార్ ను సీఎం పాత్రలో చూపించడానికి అద్భుతమైన కథను తయారు చేశారట. ఆ కథను చిరంజీవికి వినిపించగా ఆయనకు కూడా కథ నచ్చిందట.

    అయితే మెగాస్టార్ కు కథ నచ్చినా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా బదులుగా చిరంజీవి వీవీ వినాయక్ కాంబినేషన్ లో ఠాగూర్ సినిమా తెరకెక్కింది. ఒక ఇంటర్య్వూలో వీవీ వినాయక్ మాట్లాడుతూ స్వయంగా ఈ విషయాలను వెల్లడించారు. ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న వీవీ వినాయక్ ఈ మధ్య కాలంలో కొంచెం స్లో అయ్యారు. ఆయన దర్శకత్వంలో చివరిగా తెరకెక్కిన ఇంటెలిజెంట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.

    కత్తి సినిమా రీమేక్ ఖైదీ నంబర్ 150ను అద్భుతంగా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన వినాయక్ లూసిఫర్ రీమేక్ ను చిరంజీవితో తెరకెక్కించనున్నట్టు సమాచారం. మలయాళ సినిమా అయిన లూసిఫర్ ఆ భాషలో బ్లాక్ బస్టర్ హిట్టైంది. ఠాగూర్, ఖైదీ నంబర్ 150 లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన వినాయక్ అంటే చిరంజీవికి సైతం ఎంతో అభిమానం. దీంతో చిరంజీవి వినాయక్ కు మరో అవకాశం ఇచ్చారు.

    చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు వినాయక్ ఈ సినిమా కథను సిద్ధం చేశారు. వినాయక్ రీమేక్ సినిమాలను అద్భుతంగా తెరకెక్కిస్తాడని పేరు ఉండటంతో ఆయనకు మరో అవకాశం దక్కింది. మరోవైపు మహేష్, పవన్ కళ్యాణ్ తో సినిమాలు తీయకపోవడం గురించి ఫీల్ అవుతున్నానని ఆయన అన్నారు.