https://oktelugu.com/

కరోనా గురించి షాకింగ్ న్యూస్.. వాళ్లకు మళ్లీ వైరస్ సోకుతుందంట..?

ఐసీఎంఆర్‌ కరోనా మహమ్మారి గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు పిడుగులాంటి వార్త చెప్పింది. వైరస్ నుంచి కోలుకున్న వాళ్లలో ఐదు నెలల్లో యాంటీబాడీలు తగ్గిపోతే మళ్లీ వైరస్ సోకే అవకాశం ఉందంటూ సంచలన ప్రకటన చేసింది. ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ కరోనా నుంచి కోలుకున్న వాళ్లు సైతం మళ్లీ వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. వైరస్ నుంచి కోలుకున్న వాళ్లు మాస్క్ ధరించడం, […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 21, 2020 8:16 am
    Follow us on

    ఐసీఎంఆర్‌ కరోనా మహమ్మారి గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు పిడుగులాంటి వార్త చెప్పింది. వైరస్ నుంచి కోలుకున్న వాళ్లలో ఐదు నెలల్లో యాంటీబాడీలు తగ్గిపోతే మళ్లీ వైరస్ సోకే అవకాశం ఉందంటూ సంచలన ప్రకటన చేసింది. ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ కరోనా నుంచి కోలుకున్న వాళ్లు సైతం మళ్లీ వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు.

    వైరస్ నుంచి కోలుకున్న వాళ్లు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లను వినియోగించి తరచూ శుభ్రం చేసుకోవడం ద్వారా వైరస్ బారిన పడకుండా రక్షించుకోవడం సాధ్యమవుతుందని తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా వైరస్ నుంచి కోలుకున్న వాళ్లలో రెండు రీఇన్ఫెక్షన్‌ కేసులను గుర్తించామని తెలిపారు. డబ్ల్యూహెచ్వో లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 24 రీ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి.

    మూడు నుంచి ఐదు నెలల్లో యాంటీబాడీలు తగ్గిన వారికే కరోనా వైరస్ సోకినట్టు గుర్తించామని అన్నారు. సెంటర్ ఫర్ డిసీజ్ & ప్రివెన్షన్ మూడు నెలల తర్వాత మళ్లీ వైరస్ నిర్ధారణ అయితే దానిని రీ ఇన్ఫెక్షన్ గా పరిగణిస్తామని.. యాంటీబాడీలు తగ్గడం వల్లే ఈ విధంగా జరుగుతుందని ఐసీఎంఆర్ చెబుతోంది. కరోనా కొత్త వ్యాధి కావడంతో ఈ వైరస్ గురించి పరిమిత సమాచారం మాత్రమే ఉందని ఐసీఎంఆర్ వెల్లడిస్తోంది.

    ఐసీఎంఆర్ దేశంలో ఆక్సిజన్ కొరత ఉన్నట్టు వార్తలు వస్తున్నా ఆ వార్తల్లో వాస్తవం లేదని.. 6 వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సామర్థ్యం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. ఈ నెల చివరినాటికి ఆక్సిజన్ సామర్థ్యాన్ని మరింత పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.