Stock Market :స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని చాలా మందికి కోరిక ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు సంపాదించాలని చాలా మంది అనుకుంటారు. ఇలా ఇన్వెస్ట్ మెంట్ చేసి అధిక లాభాలు ఆర్జించిన వారున్నారు. ఇదే సమయంలో భారీగా నష్టపోయిన వారు కూడా ఉన్నారు. అయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునేవారు ముందుగా సంబంధిత బ్రోకరేజ్ సంస్థను సంప్రదించాల్సి ఉంటుంది. ఏ వ్యక్తి అయితే స్టార్ మార్కెట్లో షేర్లు కొనాలనుకుంటాడో.. ఆ వ్యక్తికి ఈ బ్రోకరేజీ సంస్థ సహకరిస్తుంది. ఇందు కోసం కొంత ఛార్జీలు వసూలు చేస్తుంది. కానీ కొన్ని బ్రోకరేజీ సంస్థలు ఒక్క రూపాయి కూడా ఛార్జీలు వసూలు చేయవు. మరి ఆ సంస్థ గురించి తెలుసుకోవాలని ఉందా..
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ మెంట్ పెట్టిసక్సెస్ అయిన వారు కొందరే ఉంటారు. ఇందులో రాణించాలంటే కొన్ని రోజుల పాటు అనుభవం ఉండాలి. పరిస్థితులకు అనుగుణంగా ఏ కంపెనీలో పెట్టుబుడులు పెడితే ఎలాంటి లాభాలు వస్తాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ విషయాలన్నీ కొన్ని బ్రోకరేజీ సంస్థలు అవగాహన కల్పిస్తాయి. వ్యక్తుల చేత పెట్టుబడుల నుంచి వారికి తగిన సూచనలు, సలహాలు ఇస్తుంటాయి.
ఇందు కోసం సంస్థలు పెట్టుబడిదారుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తాయి. కొందరు ఈ ఛార్జీలు చెల్లించలేకపోతారు. ఇలాంటి వారి కోసం కొన్ని సంస్థలు ఎలాంటి ఫీజు లేకుండా ప్రాసెస్ చేస్తారు. వీటిలో Shoonya by Finavasia అనే సంస్థ జీరో బ్రోకరేజ్ సంస్థగా పేరు తెచ్చుకుంది. ఎవరైనా కొత్తగా డిమాట్ అకౌంట్ తీయాలన్నా.. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాలనుకున్నా.. ఈ సంస్థ ద్వారా ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
కొన్ని సంస్థలు తక్కవగా..మరికొన్ని ఎక్కువగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. కానీ ఈ సంస్థ మాత్రం ఇన్వెస్టర్ల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయవు. ఇలాంటి సంస్థలే మరికొన్ని ఉన్నాయి. వాటి ద్వారా పెట్టుబడులు పెట్టొచ్చు. కొంత మంది ఇలాంటి వాటిపై అవగాహన లేకపోవడంతో సంస్థలు విధించే ఛార్జీలతో సతమతమవుతున్నారు. అందువల్ల ఇలాంటి సంస్థల ద్వారా పెట్టుబుడులు పెట్టి ఖర్చులు తగ్గించుకోవచ్చు.