Godfather Censor Review: మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ పై మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా అప్ డేట్ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ‘గాడ్ ఫాదర్’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. దుబాయ్ లో ఉంటూ ఇండియన్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే సినీ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు ‘గాడ్ ఫాదర్’ సినిమాకి రివ్యూ ఇచ్చాడు. ”గాడ్ ఫాదర్ ఫైనల్ ఎడిటింగ్ అయిపోయింది. రిపోర్ట్స్ వచ్చాయి. సినిమా మైండ్ బ్లోయింగ్ గా ఉంది. చిరంజీవి ఇరగదీసాడు” అంటూ ఉమైర్ సంధు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు.
ప్రస్తుతం ఈ ట్వీట్ చూసి మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అక్టోబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా హైప్‌ను మరింత పెంచేందుకు ఈ రివ్యూ బాగా పనికొస్తోంది. మరి ఈ రివ్యూ నిజమే అయితే మెగాఫ్యాన్స్ ఆనందానికి ఇక అవధులుండవు. పైగా ఈ సినిమాలో చిరంజీవి తొలిసారి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించనున్నారు. దీనికితోడు ఈ సినిమాతో ఐయామ్ బ్యాక్ అంటూ మెగాస్టార్ యాక్షన్ లో దిగడంతో సినిమా పనుల్లో స్పీడ్ డబుల్ అయింది.
ఈ సినిమాలో మెగాస్టార్ ప్లాష్ బ్యాక్ లో స్టూడెంట్ లీడర్ గా నటిస్తున్నాడట. పైగా సినిమాలో మంచి ఎమోషన్స్ ను కూడా యాడ్ చేశారని.. మెగాస్టార్ కి, మెగాస్టార్ తండ్రి పాత్రకు మధ్య బలమైన ఎమోషనల్ సీన్స్ ఉంటాయట. మెగాస్టార్ ఫాదర్ గా సీనియర్ నటుడు విజయ్ చందర్ నటించబోతున్న సంగతి తెలిసిందే. అంటే సీఎం పాత్రలో విజయ్ చందర్ కనిపించబోతున్నాడు అన్నమాట. ఈ పాత్ర చనిపోయాకే మెగాస్టార్ హీరోయిజమ్ ఎలివేట్ అవుతుంది.
నిజానికి మెగాస్టార్ చేస్తున్న సినిమాల్లోనే ఫుల్ క్రేజ్ ఉన్న సినిమా కావడంతో ఈ చిత్రం పై చిరు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే, పక్కా హీరోయిజమ్ తో సాగే సినిమా ఇది, అందుకే ఫ్యాన్స్ కూడా ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాలోని కీలకమైన యాక్షన్ సీన్స్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
Also Read: Telangana Govt Set Up Krishna Raju Statue: కృష్ణంరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న తెలంగాణ ప్రభుత్వం… ANR కూడా దక్కని ఈ గౌరవం వెనుక మతలబు ఏమిటి ?
మొత్తానికి బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు అవ్వడం ఖాయం. కాగా కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి తమన్ స్వరాలందిస్తుండగా.. నిరవ్ షా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.