Sankranti movies 2026 : తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. సంక్రాంతి సీజన్ కి వచ్చిన సినిమాలు భారీ స్థాయిలో రిలీజ్ అవ్వగా అవన్నీ ప్రేక్షకుల మన్ననలు పొందుతూ ముందుకు దూసుకెళ్తూ ఉండడం విశేషం…ఈ సంక్రాంతి సినిమాలు తొందర్లోనే ఓటిటిలోకి దర్శనం ఇవ్వబోతున్నాయి. ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతున్నాయి అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
రాజాసాబ్
ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్లో వచ్చిన రాజాసాబ్ సినిమా ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. ఇక ఈ సినిమా భారీ కలెక్షన్స్ ని కూడా సంపాదించలేకపోయింది. కారణం ఏదైనా కూడా మారుతి ప్రభాస్ కెరియర్ లో ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలిపోతుందనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఫిబ్రవరి మొదటి వారంలో జియో హాట్ స్టార్ లో స్రీమింగ్ కి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది…
మన శంకర్ వర ప్రసాద్
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన మన శంకర్ వరప్రసాద్ సినిమా ఈ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. భారీ సక్సెస్ ని సాధించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన జీ 5 లో ఫిబ్రవరి మొదటి వారం నుంచి స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది…
భర్త మహాశయులకు విజ్ఞప్తి
రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. రవితేజ కెరియర్ లోనే తనకు ఒక డిఫరెంట్ సినిమా చేసే అవకాశం కూడా లభించింది. ఈ సినిమా ఫిబ్రవరి రెండో వారం నుంచి జీ5 లో స్ట్రీమింగ్ అవ్వడానికి సిద్ధమవుతోంది…
అనగనగా ఒక రాజు
నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ సినిమా ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 27 కోట్ల బిజినెస్ ను జరుపుకుంది. ఇక మొదటి మూడు రోజుల నుండి 70 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టి సక్సెస్ ను సాధించింది. ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో ఏ రేంజ్ కలెక్షన్స్ ను సంపాదిస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా ఫిబ్రవరి రెండో వారం నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది…
నారీ నారీ నడుమ మురారి
శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక ఈ మూవీ ఫిబ్రవరి మొదటి వారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది…
