Chiranjeevi : సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ స్టేటస్ లు మాత్రమే గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ దాన్ని దక్కించుకోవడానికి వాళ్ళు ఎన్ని కోల్పోవాల్సి వస్తుందనే విషయం మాత్రం ఎవరికి అర్థం కాదు. ఎన్నో నిద్రలేని రాత్రులను గడుపుతూ, ఎన్నో పూటలు పస్తులు ఉంటూ గడిపిన ప్రతి క్షణం సక్సెస్ అయిన తర్వాత వాళ్లకు ఒక మధురానుభూతిని కలిగిస్తోంది. ఏ కష్టము పడకుండా ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే అది ఎవ్వరి వల్ల కాదనే చెప్పాలి.
తెలుగులో వరుస విజయాలను అందుకుంటూ తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాకుండా మెగాస్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు చిరంజీవి(Chiranjeevi)… ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన సాధించిన విజయాలు, ఆయన అందుకున్న అవార్డులు ఆయనను చాలా గొప్పగా పరిచయం చేస్తూ ఉంటాయి. ఏ ఫీల్డ్ లో ఉన్న వారైనా సరే చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ల ఫీల్డ్ లో నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకోవాలని కష్టపడుతూ ముందుకు దూసుకెళ్లేవారు చాలా మంది ఉన్నారనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంత గొప్ప గుర్తింపును సంపాదించుకున్న నటుడు చిరంజీవే కావడం విశేషం… 70 సంవత్సరాల వయసులో కూడా ఎవ్వరికి తగ్గకుండా యంగ్ హీరోలకు సైతం పోటీని ఇచ్చే విధంగా వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు… అలాంటి చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు… ఇక ఇదిలా ఉంటే చిరంజీవి తన ఎంటైర్ కెరియర్ లో ఒక సినిమా డైరెక్షన్ చేయాలని అనుకున్నారట.
తను అనుకున్నట్టుగానే సినిమాకి డైరెక్షన్ చేసే అవకాశం వచ్చినప్పటికి ఆయన చేయకుండా వేరే వాళ్ళతో చేయించారట. ‘యండమూరి వీరేంద్రనాధ్’ చిరంజీవి హీరోగా ‘స్టువర్టుపురం పోలీస్ స్టేషన్’ అనే సినిమాని తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా 50% షూట్ పూర్తి చేసుకున్న తర్వాత యండమూరి ఈ సినిమాను నేను సరిగ్గా డీల్ చేయలేకపోతున్నానని చేతులెత్తేసారట.
Also Read : మెగాస్టార్ చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం..? టీమ్ షాకింగ్ ప్రకటన, నిజం ఏమిటంటే?
దాంతో ప్రొడ్యూసర్స్ కి నష్టం రాకూడదనే ఉద్దేశ్యంతో సినిమా ప్లాపైన పర్లేదు పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలనే ఒకే ఒక కాన్సెప్ట్ తో చిరంజీవి డైరెక్షన్ చేయాలని అనుకున్నాడు. కానీ తనకు ఈ సినిమాని ఎలా చేస్తే బాగుంటుందో ఐడియా రాకపోవడంతో వేరొక దర్శకుడితో ఈ సినిమాని పూర్తి చేయించారట.
మొత్తానికైతే ఈ సినిమా రిలీజ్ అయి డిజాస్టర్ అవ్వడమే కాకుండా కొంతలో కొంత నష్టం అయితే మిగిల్చిందనే చెప్పాలి… మరి మెగాస్టార్ చిరంజీవి ఫ్యూచర్లో ఏదైనా సినిమాకి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయా అనే ధోరణిలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ఇక ఇప్పటివరకు ఆయన 150 పైచిలుకు సినిమాల్లో హీరోగా నటించినప్పటికి దర్శకత్వం మీద మాత్రం ఆయన ఎప్పుడు పెద్దగా ఫోకస్ అయితే పెట్టలేదు. మరి ఇప్పుడు ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా అనే ధోరణిలో కూడా కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి…
Also Read : మెగాస్టార్ చిరంజీవి కి అరుదైన పురస్కారం అందించిన లండన్ ప్రభుత్వం..దేశంలోనే మొట్టమొదటి భారతీయుడు!