Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). దాదాపు 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపుని సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి స్టార్ హీరో గా ఎదిగి టాలెంట్ ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించిన హీరో కూడా చిరంజీవి గారే కావడం విశేషం… ఇక ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని ఫినిష్ చేశారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాతో చిరంజీవి మంచి విజయాన్ని సాధిస్తానని ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ చిరంజీవి తన తదుపరి సినిమాను అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపు సంపాదించి పెట్టుకోవాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. నిజానికి చిరంజీవి వశిష్ట సినిమా పూర్తి అయిన వెంటనే వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఒక సినిమా చేయాల్సింది. కానీ ఆ ప్రాజెక్టు చాలా రోజులు హోల్డ్ లో పెట్టి ఆ తర్వాత క్యాన్సిల్ చేశారు. కారణం ఏంటి అంటే వెంకీ కుడుముల కథలో అంత పెద్దగా కొత్తదనం అయితే ఏమి కనిపించలేదట.
Also Read: అల్లు అర్జున్ అట్లీ కాంబోలో వస్తున్న సినిమా కోసం రిస్క్ చేస్తున్నారా..?
ఆయన చెప్పిన కథ రొటీన్ ఫార్మాట్లోనే సాగుతూ ఉండడం వల్ల ఆయన స్టోరీని చిరంజీవి రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి మొత్తానికైతే వెంకీ కుడుముల ప్రస్తుతం నితిన్ తో చేసిన రాబిన్ హుడ్ (Rabeen hood) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో ఆయన భారీ డిజాస్టర్ ని మూట గట్టుకున్నాడు.
ఇక ఇదే విషయాన్ని ముందే అంచనా వేసిన చిరంజీవి తనతో సినిమా చేయకుండా తప్పించుకున్నాడనే చెప్పాలి. ఇక ఎలాంటి కథ ఆడుతుంది ఏ కథ ప్రేక్షకున్ని ఎంజాయ్ చేయగలుగుతుంది అనే విషయంలో చాలా మంచి పట్టు ఉంది. ఆయన అనుభవమే దానికి కారణం అని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను చెబుతూ ఉంటారు.
ఇక ఇలాంటి క్రమం లోనే ఎవరితో సినిమా చేస్తే వర్కౌట్ అవుతుంది అనేది తెలుసుకొని మరి చిరంజీవి వాళ్ళతో సినిమాలను చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటాడు…అనిల్ రావిపూడి ఇప్పుడు సినిమా పూర్తి అయిన తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు…