Chiranjeevi Bobby Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. వాళ్ళు చేసే సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే బాబీ లాంటి దర్శకుడు చేసిన సినిమాలన్నింటితో సూపర్ సక్సెస్ లను సాధించాడు. ప్రస్తుతం ఆయన చిరంజీవితో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో చిరంజీవి ఒక్కసారిగా తన స్టార్ డమ్ ను విస్తరించుకున్నాడు…అలాంటి చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో సైతం చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక బాబీ డైరెక్షన్లో చేయబోతున్న సినిమాలో ఆయన చాలా డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించడానికి సిద్ధమయ్యారట.
Also Read: యుద్ధంలోకి మరో రెండు దేశాలు.. ఇరాన్‌కు మరిన్ని కష్టాలు!
ఇప్పటికి ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ పాత్రలో తనను తాను చూసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే రాబోయే సినిమాలతో ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు. ప్రస్తుతం ప్రేక్షకులందరిలో తనకంటూ ఒక ఐడెంటిటిని ఏర్పాటు చేసుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…
ఈ సినిమాలో చిరంజీవి ఒక మాఫియా డాన్ క్యారెక్టర్ లో నటిస్తున్నారట. ఇక దాంతోపాటుగా మరో క్యారెక్టర్ లో కూడా నటించడానికి సిద్ధమయ్యారట. కొండవీటి దొంగ సినిమాలో ఎలాగైతే కౌ బాయ్ గెటప్ లో కనిపించాడో ఇప్పుడు మరోసారి చిరంజీవి అదే క్యారెక్టర్ లో ఒక పది నిమిషాల పాటు సినిమాలో కనిపించడానికి సిద్ధమవుతున్నాడట. బాబీ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్లో నిలపడానికి తీవ్రమైన సన్నహాలైతే చేస్తున్నాడు…
ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని కట్టబెడుతుందా? మరోసారి వీళ్ళ కాంబినేషన్ సక్సెస్ ఫుల్ గా నిలుస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక చిరంజీవి ఈ సినిమా తరువాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నాడు… రాబోయే ఈ రెండు సినిమాలతో సక్సెస్ సాధిస్తే చిరంజీవి క్రేజ్ టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోతుంది…
