Chiranjeevi and Balaya babu : తెలుగు ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల పాటు తనకంటూ ఒక క్రేజ్ ఏర్పాటు చేసుకున్న హీరో చిరంజీవి (Chiranjeevi)… గత 50 సంవత్సరాల నుంచి మెగాస్టార్ గా గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈయన ప్రస్తుతం యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తున్నాడు. ఇక 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన సినిమాల మీద ఉన్న ఇష్టంతో వరుసగా సినిమా చేస్తూ ముందుకు సాగడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఒకానొక సమయంలో బాలయ్య బాబుకి, చిరంజీవికి మధ్య మంచి పోటీ అయితే ఉండేది. వీళ్ళ సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ అయితే ఉండేది. ఇక దానికి తోడుగా ఇద్దరు కూడా మాస్ హీరోలుగా రాణించే ప్రయత్నం కూడా చేశారు. ఇక వీళ్ళ కాంబినేషన్ లో.మల్టీ స్టారర్ నిమా చేయాలని అప్పట్లో చాలా మంది దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే బాలయ్య బాబు చిరంజీవి సైతం వాళ్ళ కాంబినేషన్ లో సినిమా చేయడానికి ఇష్టపడ్డారు. అయినప్పటికీ చిరంజీవి వాళ్ళ బావమరిది అయిన అల్లు అరవింద్ మాత్రం ఈ సినిమా చేస్తే వాళ్ళ ఇమేజ్ లు దెబ్బతింటాయనే ఉద్దేశ్యంతో ఇద్దరికీ న్యాయం చేసే కథలు దొరకడం కష్టమని చెప్పాడు. దాంతో వీళ్ళ కాంబినేషన్లో సినిమా ఓకే అయ్యే పరిస్థితులు వచ్చినప్పటికి చిరంజీవి వాటిని రిజెక్ట్ చేస్తూ వచ్చాడనే వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి.
Also Read : బోయపాటి చిరంజీవి కాంబోలో సినిమా రాబోతోందా..? కథ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు…
మరి బాలయ్య బాబు అయితే చిరంజీవితో సినిమా చేయడానికి తను ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నానని చాలా సందర్భాల్లో ప్రకటించాడు. ఇక ఇప్పుడైనా సరే వీళ్ళ కాంబోలో ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఒకవేళ సినిమా వీళ్ళ కాంబోలో సినిమా కనక వచ్చినట్టయితే ఆ సినిమాకి ఇప్పటికి కూడా మంచి బజ్ అయితే ఉంటుంది. తద్వారా ఈ సినిమా ఆశించిన మేరకు భారీ విజయాన్ని సాధించి వాళ్ళిద్దరిని ఇప్పటికి కూడా స్టార్ హీరోలుగా నిల్చోబెడతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
మరి ఇప్పటికి కొంత మంది డైరెక్టర్లు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా చేయడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఫ్యూచర్ లో అయిన వీళ్ళ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : రామ్-బోయపాటి సినిమాలో జై బాలయ్య… పాన్ ఇండియా అంటూ ఇవేం ప్రయోగాలు బాబోయ్!