https://oktelugu.com/

Balakrishna- Boyapati Srinu- Ram Pothineni: రామ్-బోయపాటి సినిమాలో జై బాలయ్య… పాన్ ఇండియా అంటూ ఇవేం ప్రయోగాలు బాబోయ్!

Balakrishna- Boyapati Srinu- Ram Pothineni: అఖండ మూవీతో బోయపాటి శ్రీను పేరు మారుమ్రోగింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ మెల్లగా పుంజుకొని రికార్డు కలెక్టన్స్ రాబట్టింది. రూ. 120 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టిన అఖండ బాలయ్యను వంద కోట్ల క్లబ్ లో చేర్చింది. దానికి తోడు సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ నేపథ్యంలో భారీ లాభాలు పంచింది. అఖండ చిత్రంలో బోయపాటి రూ. 20 కోట్లకు పైనే ఆర్జించినట్లు సమాచారం. […]

Written By:
  • Shiva
  • , Updated On : June 18, 2022 / 05:30 PM IST
    Follow us on

    Balakrishna- Boyapati Srinu- Ram Pothineni: అఖండ మూవీతో బోయపాటి శ్రీను పేరు మారుమ్రోగింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ మెల్లగా పుంజుకొని రికార్డు కలెక్టన్స్ రాబట్టింది. రూ. 120 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టిన అఖండ బాలయ్యను వంద కోట్ల క్లబ్ లో చేర్చింది. దానికి తోడు సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ నేపథ్యంలో భారీ లాభాలు పంచింది. అఖండ చిత్రంలో బోయపాటి రూ. 20 కోట్లకు పైనే ఆర్జించినట్లు సమాచారం. ఈ ఊపులో హీరో రామ్ తో పాన్ ఇండియా మూవీ ప్రకటించాడు.

    Balakrishna- Boyapati Srinu

    ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. రామ్ ప్రస్తుతం నటిస్తున్న ది వారియర్ షూటింగ్ పూర్తి కాగానే బోయపాటి మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని సమాచారం. ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర వార్త పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. దర్శకుడు బోయపాటి బాలయ్య అభిమానుల కోసం స్పెషల్ ఎపిసోడ్ రాసుకున్నాడట. మూవీలో ఓ సన్నివేశం బాలయ్య రిఫరెన్స్ తో సాగుతుందట. ఆ సన్నివేశంలో జై బాలయ్య నినాదాలు మారుమ్రోగనున్నాయట. బాలయ్య అభిమానులకు ఈ సీన్ గూస్ బంప్స్ కలిగించడం ఖాయమంటున్నారు.

    Also Read: Telugu Indian Idol: నిజంగానే ‘మెగా’ మనసు.. చిరంజీవిని ఇంత జోష్ లో ఎప్పుడూ చూడలేదు..

    అయితే పాన్ ఇండియా చిత్రంలో ఇలాంటి ప్రయోగాలేమిటని కొందరు పెదవి విరుస్తున్నారు. అందులోనూ బాలయ్య టాలీవుడ్ ప్రేక్షకులకు తప్పితే పక్కనే ఉన్న కోలీవుడ్, మాలీవుడ్ జనాలకు కూడా తెలియదు. ఇక నార్త్ ఇండియా ప్రేక్షకుల సంగతి చెప్పాలిన పనిలేదు. ఆ విషయం అటుంచితే బలమైన కంటెంట్ మీద దృష్టి పెట్టాల్సింది పోయి బాలయ్య ఎలివేషన్స్ కోసం ఎపిసోడ్స్ రాసుకోవడం ఏమిటీ అంటున్నారు. పాన్ ఇండియా అని ప్రకటించుకున్నప్పుడు కొంచెమైనా సీరియస్ గా ఉండాలని విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ విశ్వసనీయ వర్గాల్లో వినిపిస్తోంది.

    Boyapati Srinu- Ram Pothineni

    ఇక ఇస్మార్ట్ శంకర్ మూవీతో బ్రేక్ అందుకున్న రామ్ కి రెడ్ మూవీ షాక్ ఇచ్చింది. తమిళ్ రీమేక్ గా తెరకెక్కిన రెడ్ ఆశించిన విజయం సాధించలేదు. దీంతో ది వారియర్, బోయపాటి చిత్రాలపైనే ఆశలు పెట్టుకున్నారు. యూట్యూబ్ లో రామ్ హిందీ డబ్బింగ్ చిత్రాలు భారీ వ్యూస్ రాబట్టాయి. ఈ క్రమంలో నార్త్ లో సక్సెస్ కావచ్చని రామ్ భావిస్తున్నాడు. అందుకే బోయపాటితో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించారు. మరి రామ్ ఆశలు ఏ మేరకు తీరుతాయో చూడాలి.

    Also Read:Mahesh – Rajamouli Cinema: ఇక మొదలైనట్టే! మహేష్ – రాజమౌళి సినిమా గురించి అభిమానులకు చేదు వార్త

    Tags