Allu Arjun : ఐకాన్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్(Allu Arjun)…పుష్ప 2 (Pushpa 2) సినిమాతో పాన్ ఇండియాలో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా సంపాదించి పెట్టుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు. తద్వారా ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధించే ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయాల పట్ల కూడా సరైన క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న అర్జున్ వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొన్ని నష్టాలు అయితే జరిగాయి. పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో ఆయన ధియేటర్ కి వెళ్లడం వల్ల రేవతి అనే యువతి మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. అప్పటినుంచి ప్రీమియర్ షోలకి గాని, బెనిఫిట్ షో లకు గాని ప్రభుత్వం అయితే అనుమతి ఇవ్వడం లేదు. తద్వారా కొన్ని సినిమాలకు భారీ ఓపెనింగ్ రావడంలో చాలావరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయా సినిమాలో ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లినప్పటికి మరొక రకంగా మాత్రం సినిమా ఇండస్ట్రీకి అన్యాయం చేశారనే చెప్పాలి.
మరి ఇకమీదటైనా ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్ యొక్క ఆవేదనను పట్టించుకొని ప్రభుత్వం కొన్ని కండిషన్స్ విధించి బెనిఫిట్ షోస్ కి ప్రీమియర్ షోస్ కి అనుమతిస్తే బాగుంటుందని కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతవరకు సినిమా ప్రొడ్యూసర్లకు కొన్ని ఇబ్బందులైతే ఎదురవుతున్నాయి.ఇక దానికి తోడుగా బడ్జెట్ భారీగా పెరిగిపోవడం, హీరోలా రెమ్యునరేషన్స్ పెంచేయడం ప్రేక్షకుడు థియేటర్ కి రాకపోవడం వల్ల ఎక్కువ సంఖ్యలో ప్రొడ్యూసర్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది.
తద్వారా సినిమాకి వచ్చే లాభం కంటే ప్రొడ్యూసర్స్ కి వచ్చే నష్టాలు ఎక్కువైపోతున్నాయి అంటూ చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు…మరి ఇక మీదట వీటికి చెక్ పెడుతూ ఇండస్ట్రీ ని సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది.
Also Read : అల్లు అర్జున్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇవ్వడం అతని అభిమానులను ఇబ్బంది పెడుతుందా..?