Priyadarshi: చిన్న స్థాయి నుండి నేడు ఇండియా లోనే మోస్ట్ వాంటెడ్ కొరియోగ్రాఫర్స్ లో ఒకరిగా శేఖర్ మాస్టర్(Shekar Master) రేంజ్ ప్రస్తుతం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దాదాపుగా స్టార్ హీరోలందరూ శేఖర్ మాస్టర్ నే తమ సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పెట్టుకుంటున్నారు. కేవలం స్టార్ హీరోలు మాత్రమే కాదు, సీనియర్ హీరోలు, ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్న కొత్త హీరోలకు కూడా ఆయనే కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ఈమధ్య కాలం లో శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన కొన్ని స్టెప్పులు వివాదాస్పదంగా మారాయి. ఆ విధంగా కూడా ఆయన ట్రెండింగ్ లోకి వచ్చాడు. అలా శేఖర్ మాస్టర్ పేరు ఎక్కడ చూసినా మారుమోగిపోతున్న ఈ సమయంలో, ఆయన పేరునే మర్చిపోయాడు ప్రముఖ హీరో / కమెడియన్ ప్రియా దర్శి. అందుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
Also Read: అంతరిక్షం లోకి రామ్ చరణ్ ‘పెద్ది’..సోషల్ మీడియా ని ఊపేస్తున్న వీడియో!
పూర్తి వివరాల్లోకి వెళ్తే శేఖర్ మాస్టర్ మరియు యాంకర్ అనసూయ(Anchor Anasuya) కలిసి ప్రతీ శని, ఆదివారాల్లో స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ‘కిరాక్ బాయ్స్..కిలాడీ లేడీస్ 2′(Kiraak Boys..Khiladi Ladies 2) ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఈ షో లో వాళ్ళు కంటెస్టెంట్స్ తరుపున గేమ్ చేంజర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షో కి నేడు తన కొత్త సినిమా ‘సారంగపాణి జాతకం’ ప్రొమోషన్స్ కోసం ప్రియదర్శి(Priyadarshi) విచ్చేశాడు. ‘కోర్ట్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఈ నెల 25న థియేటర్స్ లోకి రాబోతున్న సినిమా ఇది. అయితే ఆయన పాల్గొన్న ఈ షో కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేయగా అందులో ఆయన శేఖర్ మాస్టర్ పేరు ని మర్చిపోవడం హాట్ టాపిక్ గా మారింది. ముందుగా యాంకర్ శ్రీముఖి ప్రియదర్శి ని ఒక ప్రశ్న అడుగుతూ ‘ఈరోజు ఎపిసోడ్ లో గెలిచేది కిరాక్ బాయ్స్ , లేదా కిరాక్ లేడీస్?’ అని అడుగుతుంది.
దానికి ప్రియదర్శి సమాధానం చెప్తూ ‘ఎవరి జాతకం బాగున్నా, బాగాలేకపోయిన సురేష్ మాస్టర్ గారి జాతకం మాత్రం అద్భుతంగా ఉంది’ అని అంటాడు. అప్పుడు శేఖర్ మాస్టర్ వెంటనే మైక్ అందుకొని ‘డార్లింగ్ ఇది మరీ టూ మచ్..సురేష్ ఎక్కడి నుండి వచ్చాడు..సురేష్ ఎవడు?’ అని అడుగుతాడు. అప్పుడు ప్రియదర్శి ‘ఇంకో షూటింగ్ నుండి వస్తున్నాను, కాస్త కన్ఫ్యూజ్ అయ్యాను’ అని అంటాడు. అప్పుడు శేఖర్ మాస్టర్ ‘అక్కడ సురేష్ అనే కొరియోగ్రాఫర్ ఉన్నాడా’ అని అడుగుతాడు. అప్పుడు ప్రియదర్శి ‘మా కో డైరెక్టర్ సురేష్ ని షూటింగ్ నుండి తొందరగా పంపించి, ఇక్కడికి రావాలి అని అడిగి అడిగి ఆయన పేరు అలా మైండ్ రిజిస్టర్ అయిపోయింది’ అని అంటాడు. అప్పుడు శ్రీముఖి ‘చాలా చక్కటి కవర్ డ్రైవ్ ‘ అని అంటుంది. ఈ వీడియో ని మీరు కూడా చూసి మీ అభుప్రాయాన్ని తెలియజేయండి.
Also Read: శోభా శెట్టి ని షో నుండి పరుగులు తీయించిన ప్రభాకర్..వీడియో వైరల్!
