Mahesh Babu : సూర్య డెవలపర్స్(Sai Surya Developers) మనీ లాండరింగ్(Money Laundering) కేసు లో విచారణకు హాజరు కావాల్సిందిగా, ఆ సంస్థ కు సంబంధించిన యాడ్ లో నటించిన సూపర్ స్టార్ మహేష్ బాబు(Super star Mahesh Babu) ని ఈడీ అధికారులు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈమేరకు అధికారులు మహేష్ కి నోటీసులు కూడా పంపించారు. గత నెల 27 లేదా 28 తేదీలలో ఆయన హాజరు కావాల్సి ఉంది. కానీ షూటింగ్ లో బిజీ గా ఉండడం వల్ల ఈ తేదీలలో రాలేనని, వేరే ఏ డేట్ లో చెప్పినా వస్తానని మహేష్ అధికారులను రిక్వెస్ట్ చేసుకున్నాడు. వాళ్ళు కూడా మహేష్ విన్నపాన్ని మన్నించి మే 12న హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. మహేష్ బాబు విచారణకు వస్తానని సమాచారం అయితే అందించాడు కానీ, వచ్చాడో లేదో అనే విషయం పై మీడియా కు ఎలాంటి సమాచారం లేదు.
Also Read : కన్నప్ప’ కి స్పాట్ పెట్టిన ‘హరి హర వీరమల్లు’..పాపం మంచు విష్ణు ఏమైపోతాడో!
అసలు మహేష్ బాబు విచారణకు రాలేదని, ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నాడని కొందరు ప్రచారం చేస్తుంటే, మీడియా కి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మహేష్ బాబు సైలెంట్ గా విచారణకు హాజరై వెళ్లిపోయాడని మరి కొందరు అంటున్నారు. బహుశా ఈ విషయం బయట లీకై ఇష్టమొచ్చినట్టు పిచ్చి రాతలు రాస్తారేమో అని మహేష్ భయం ఏమో. కానీ కోట్లాది మంది అభిమానాన్ని చూస్తున్న మహేష్ బాబు, తనపై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఊహాగానాల్లో వినిపించేవే నిజమని అందరూ అనుకుంటారు. ఈడీ ఆఫీస్ కి నిజంగా ఆయన వచ్చి ఉంటే మీడియా కి చిన్నపాటి సమాచారం అయినా ఇవ్వాలి. లేకపోతే ఈడీ ఆదేశించినా మహేష్ బాబు రాలేదు, ఇక ఆయనపై చర్యలు తప్పవు అని ప్రత్యేక కథనాలు సృష్టిస్తారు. కాబట్టి ఏదైనా పబ్లిక్ కి తెలిసేలా చేయడమే ఉత్తమం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఏది ఏమైనా మహేష్ బాబు మీద ఎంత నెగెటివ్ ప్రచారం చేసినా నమ్మే స్థితిలో తెలుగు ప్రేక్షకులు లేరని, ఎన్నో వేలమంది చిన్నారుల ప్రాణాలను కాపాడిన మహేష్ బాబు ని జనాలు దేవుడితో సమానంగా పూజిస్తున్నారని మహేష్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రస్తుతం తాత్కాలిక బ్రేక్ పడింది. మరో నెల రోజుల తర్వాతే షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. అప్పటి వరకు ఈ చిత్రం నుండి అప్డేట్ వచ్చే అవకాశం లేదని అంటున్నారు. ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కనీసం చిన్న అప్డేట్ వదిలినా చాలు అని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఆ అప్డేట్ వస్తుందో లేదో చూడాలి.