Krishnam Raju Samsmarana Sabha- Chiranjeevi: తన పెదనాన్న కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం ప్రభాస్ తమ సొంత గ్రామం అయిన మొగల్తూరు వచ్చారు. ఇక ఇదే గ్రామం నుంచి సీనీ ఇండస్ట్రీలో ఎదిగారు కృష్ణంరాజు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, సహా ఎంతో నటీనటులు. ఇక కృష్ణంరాజుతో చిరంజీవికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మా ఎన్నికల అధికారిగా కృష్ణంరాజే ఏరికోరి నియమించాడు చిరంజీవి. పెద్దాయనే నిర్వహించాలని పట్టుబట్టాడు. అంతటి అనుబంధంతోనే తాజాగా మొగల్తూరులో నిర్వహించిన ‘కృష్ణంరాజు సంస్మరణ’ సభకు చిరంజీవి ప్రత్యేకంగా కదిలివచ్చారు.

విశాఖలో తన సినిమా షూటింగ్ కు విరామం ఇచ్చిన చిరంజీవి తన సొంత గ్రామం మొగల్తూరుకు వచ్చాడు. ప్రభాస్ ను కలిసి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవికి జన్మలో గుర్తుండిపోయేలా ప్రభాస్ మంచి విందు ఇచ్చినట్టు తెలిసింది. మటన్, చికెన్, రొయ్యలు, చేపలు ఇలా పలు రకాలా మంసాహారాలతో వడ్డించాడట..
ప్రభాస్ వంటలకు ఫిదా అయిన చిరంజీవి తనకు రెండు క్యారేజీలు పెట్టాలని రాత్రి తింటానంటూ ప్రభాస్ ను అడిగి మరీ పట్టుకెళ్లాడట.. ప్రభాస్ ఆతిథ్యానికి చిరంజీవి మాత్రమే కాదు.. మొగల్తూరు ప్రజలు.. గోదావరి జిల్లాల్లో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోయారు. దాదాపు లక్ష మందికి పైగా ప్రభాస్ మాంసాహారంతో పలు రకాల భోజనాలు ఏర్పాటు చేసి అభిమానులకు గుర్తుండిపోయేలా వడ్డించాడట..

ఇక ప్రభాస్ ఇలా భోజనాలతో ఫిదా చేయడం ఇప్పుడే కాదు. తన ఏ చిత్రం షూటింగ్ జరిగినా తనతోపాటు నటించే నటీనటులకు, టెక్నీషియన్, షూటింగ్ సిబ్బందికి తన ఇంట్లో ప్రత్యేకంగా వంటలు వండించి ఇలా పట్టుకొస్తాడు. అందరికీ కడుపారా తినిపించి ఫిదా చేస్తుంటాడు. తాజాగా చిరంజీవికి జన్మలో మరిచిపోలేని ఆతిథ్యాన్ని ప్రభాస్ ఇచ్చినట్టు తెలిసింది.
Also Read: Kajal Aggarwal- Pushpa-2: పుష్ప-2లో కాజల్ అగర్వాల్.. ఒక్క సాంగ్ కోసం అంత డబ్బు ఇస్తున్నారా…!