Chiranjeevi And Anil Ravipudi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ప్రస్తుతం వాళ్లు చేస్తున్న సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తుండడంతో స్టార్ హీరోలందరు కమర్షియల్ సినిమాలా వెంట పడుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాల విషయంలో దర్శకులు కాస్త జాగ్రత్తలు తీసుకొని భారీ రేంజ్ లో సినిమాలను చేస్తూ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎవరు ఎలాంటి సినిమాలు చేస్తూ వచ్చినప్పటికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చేసిన సినిమాలు మాత్రం అతనికి చాలా మంచి గుర్తింపునైతే తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుక గా ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఇక ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న సినిమా యూనిట్ మూడో షెడ్యూల్ ను కూడా జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాబోతుంది అనే ధోరణిలో కొన్ని అభిప్రాయాలైతే వెలువడుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: కూలీ మూవీ మోనికా సాంగ్ లో డాన్స్ ఇరగదీసిన మంజుమ్మెల్ బాయ్స్ హీరో ‘సౌబిన్ షాహిర్’!
స్టార్ హీరోలందరు భారీ బడ్జెట్ సినిమాలను చేస్తుంటే సీనియర్ హీరోలంతా 150 కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేసి 200 కోట్లకు పైన కలెక్షన్స్ ను సాధించే దిశగా ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న ఈ సినిమా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించడమే కాకుండా దర్శకుడు ఇందులో వింటేజ్ చిరంజీవిని కూడా మనం చూపించబోతున్నాడట…
అనిల్ రావిపూడి ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నా సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించడమే కాకుండా వెంకటేష్ కెరియర్ లో ఆల్ టైమ్ సూపర్ హిట్ మూవీని అందించాడు.అయితే ఇప్పుడు చిరంజీవితో చేస్తున్న సినిమాను నెక్స్ట్ ఇయర్ 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారా? లేదంటే ఇంకా లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అని ధోరణిలో కూడా కొన్ని అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి.
మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని పర్ఫెక్ట్ గా సంక్రాంతికి దించే ప్రయత్నంలో అనిల్ రావిపూడి అయితే ఉన్నారట. ఇక ఏది ఏమైనా కూడా సంక్రాంతి బరిలో ఈ సినిమాను నిలిపి సూపర్ సక్సెస్ ని అందుకోవడమే తన లక్ష్యంగా దర్శకుడు చెబుతున్నాడు…మరి ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే అని రావిపూడి వరుసగా 9 విజయాన్ని సాధించినవాడు అవుతాడు…