Pawan Kalyan school canteen: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చేపట్టిన మరో ఉన్నత కార్యం దేశం మొత్తం మాట్లాడుకునేలా చేసింది. కడప లోని పురపాలక ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం స్టార్ కిచెన్ ని ఏర్పాటు చేశాడు. ఈ కిచెన్ ద్వారా విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ పరిణామాలతో, అత్యంత పౌషకాలు కూడిన పదార్దాలతో,సూచీ శుభ్రతతో వడ్డిస్తున్నరు. ఫైవ్ స్టార్ హోటల్ తరహాలోనే వంట కార్మికులకు డ్రెస్ కోడ్ మైంటైన్ చేస్తున్నారు. స్మార్ట్ కిచెన్, ఉపకరణాలు, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ ,ఆటోమేషన్ పరికరాల ద్వారా వంట కార్యక్రమాలు చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లు, మైక్రో ఓవెన్లు, కూకర్లతో పాటు వాహన రవాణా ట్రాకింగ్ సిస్టమ్స్ ని కూడా ఏర్పాటు చేశారు. వీటిని మానిటర్ చేయడానికి ప్రత్యేకంగా ఒక స్టాఫ్ ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సెంట్రల్ స్మార్ట్ కిచెన్ ద్వారా ప్రస్తుతం 12 పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని పాఠశాలలకు విస్తరింపజేసేలా చర్యలు చేపడుతామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చాడు.
పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ మంచి పని చూసి ఆయన అభిమానులు ఎంతో గర్వపడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా, తన సొంత నిధులతో పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాడు. విజయవాడ లో వరదలు వచ్చినప్పుడు ఆరు కోట్ల రూపాయిల తన సొంత డబ్బులను తీసి ఇచ్చిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత తన సొంత ఖర్చులతో కొన్ని కార్పొరేషన్స్ లో ఉన్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం, పిఠాపురం లో అనాధలకు సొంత జీతం తో ప్రతీ నెల డబ్బులు ఇవ్వడం, ఇలా ఒక్కటా రెండా, ప్రభుత్వం తో సంబంధం లేకుండా తన సొంత ఖర్చులు దాదాపుగా 15 కోట్ల రూపాయిల వరకు ఏడాది కాలం లో ఖర్చు చేశాడు. రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఇలా ఎంత మంది ఉంటారు చెప్పండి.
Also Read: Kota Srinivasa Rao Final Role: కోట శ్రీనివాసరావు చివరగా నటించింది హరిహర వీరమల్లు లోనేనా..?
పవన్ కళ్యాణ్ కి నిజమైన సేవ చెయ్యాలనే తపన ఉందని, అది ఆయన ప్రతీ కార్యక్రమం లో స్పష్టంగా తెలుస్తుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కేవలం అభిమానులు మాత్రమే కాదు,సోషల్ మీడియా లో ఇతర హీరోల అభిమానులు కూడా స్వాగతిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కారణంగానే 12 పాఠశాలలకు ఇలాంటి స్వచ్ఛమైన ఆహరం అందుతుందంటే, ఇక ప్రభుత్వం ఈ కార్యక్రమం పై ద్రుష్టి పెడితే రాష్ట్రము లో ఉన్న ప్రతీ ఒక్క నియోజగవర్గం లో ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు ఇలాంటి బోజనాలను ఆస్వాదించవచ్చు కదా. తల్లికి వందనం పేరుతో డబ్బులు ఇచ్చే దానికంటే ప్రభుత్వ పాఠశాలలను ఇలాంటి ఉన్నత ప్రమాణాలతో నడిపితే రాబోయే రోజుల్లో కార్పొరేట్ స్కూల్స్ ని ప్రభుత్వ పాఠశాలలు డామినేట్ చేస్తాయి అనడంలో ఎలాంటి అథోసయోక్తి లేదని విశ్లేషకులు అంటున్నారు.
డొక్కా సీతమ్మ గారి పేరిట భోజనం | కడప
♦️ కడప మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో ‘స్మార్ట్
కిచెన్’ సిద్ధమైంది.♦️ ఇక్కడి నుంచే, 12 పాఠశాలలకు
ఆహారం సిద్ధమవుతుంది. @PawanKalyan గారి సొంత నిధులతో స్మార్ట్ కిచెన్.@APDeputyCMO | @JanaSenaParty #PawanakalyanKadapa pic.twitter.com/YKFjhboP1o— (@TheBeast_619) July 11, 2025