Chiranjeevi and Anil Ravipudi : యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు తమ దైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళని వాళ్ళు స్టార్లు గా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. అందుకే స్టార్ హీరోలతో యంగ్ హీరోలు సైతం పోటీపడుతూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…ఇక ఈ ఏజ్ లో కూడా చిరంజీవి భారీ సాహసాలు చేస్తూ వైవిధ్యభరితమైన సినిమాలను చేస్తూ ఉండటం విశేషం…
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా వచ్చిన సినిమాలన్నీ భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని అలరిస్తు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్ లో ఒక మంచి కమర్షియల్ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇలాంటి సందర్భంలోనే అనిల్ రావిపూడి రీసెంట్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnaam) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా ‘గోదారి గట్టుమీద చందమామవే’ అనే సాంగ్ అయితే ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమా సక్సెస్ లో కీలకపాత్ర వహించిందనే చెప్పాలి.
Also Read : చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ హీరోయిన్ ఉండదా..? మెగాస్టార్ కెరీర్ లోనే సరికొత్త ప్రయోగం!
మరి ఈ సాంగ్ ని ఒకప్పటి ఎవర్ గ్రీన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన రమణ గోగుల పాడడం వల్ల ఈ సాంగ్ కి భారీ హైప్ అయితే క్రియేట్ అయింది. అలాగే అతని వాయిస్ కూడా ఈ సినిమాకి చాలా బాగా సెట్ అయింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కోసం కూడా రమణ గోగుల ఒక మంచి సాంగ్ ని పడబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన నాలుగు ట్యూన్స్ రెడీ చేసి పెట్టాడట.
ఇక సాంగ్స్ రికార్డింగ్ చేయించి సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్ళే ఉద్దేశ్యంలో అనిల్ రావిపూడి ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న చాలామంది దర్శకులు వాళ్ళను వాళ్ళు స్టార్లు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో అనిల్ రావిపూడి వరుసగా 8 విజయాలతో సూపర్ సక్సెస్ లను సాధించినప్పటికి ఆయనకు రావాల్సిన గుర్తింపైతే రాలేదనే చెప్పాలి.
తన తోటి దర్శకులందరూ పాన్ ఇండియా బాట పట్టి వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తు ముందుకు దూసుకెళ్తున్న సందర్భంలో అనిల్ రావిపూడి మాత్రం కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితమై పోవడం అనేది ఒక రకంగా అతని అభిమానులను కొంతవరకు నిరాశపరిచే విషయమనే చెప్పాలి. మరి చిరంజీవి ఈ సినిమాతో పాన్ ఇండియా బాట పడతాడా? లేదంటే మళ్లీ తెలుగు సినిమాలకే పరిమితం అవుతాడా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా నుంచి అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంటుంది…
Also Read : కేవలం 4 నెలల్లోనే చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రం..? మెగా ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్!