Manchu Vishnu : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas) యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఆయన సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూసే అభిమానులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం ప్రభాస్ మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా చేస్తున్న కన్నప్ప (Kannappa) సినిమాలో రుద్ర (Rudra) అనే ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ పాత్ర కోసం ఆయన ఐదు నుంచి పది రోజులు వరకు డేట్స్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మోహన్ బాబుతో ఉన్న ఫ్రెండ్షిప్ వల్లే తను కన్నప్ప సినిమా నటించాడు. అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన మంచు విష్ణు ప్రభాస్ ను ఉద్దేశించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలైతే చేశాడు.
Also Read : ‘కన్నప్ప’ పై ట్రోల్స్ ఎవరు చేయిస్తున్నారో నాకు తెలుసు అంటూ మంచు విష్ణు ఆసక్తికరమైన వ్యాఖ్యలు!
కన్నప్ప సినిమాలో ప్రభాస్ కి స్లీవ్ లెస్ డ్రెస్ వేద్దామని చూశారట. తను చాలా బక్కగా ఉండడం నాలాంటి ఫిజిక్ ను మెయింటైన్ చేయలేకపోవడం వల్లే స్లీవ్ లెస్ కాకుండా ఫుల్ లెంత్ డ్రెస్ వేశామని నాలో సగం మాత్రమే ప్రభాస్ ఉన్నాడని ప్రభాస్ ని తక్కువ చేసేలా కొన్ని మాటలు అయితే మాట్లాడాడు. దాంతో ఒక్కసారిగా ప్రభాస్ అభిమానులు మంచు విష్ణు పట్ల సోషల్ మీడియాలో తీవ్రంగా ఫైర్ అవుతూ ఆయనను ఉద్దేశిస్తూ బ్యాడ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు.
నిజానికి బాహుబలి సినిమాలో ప్రభాస్ చాలా దిట్టంగా ఉంటాడు. ఆయనతో పోలిస్తే మంచు విష్ణు ఎందుకు పనికిరాడు. కానీ మధ్యలో ప్రభాస్ కి కొన్ని హెల్తీ ఇష్యుస్ రావడం వల్ల ఆయన ఎక్కువగా బాడీని మెయింటైన్ చేయలేకపోతున్నాడు. అయినప్పటికి మంచు విష్ణు ప్రభాస్ లాంటి స్టార్ హీరో ను తక్కువ చేసి మాట్లాడడం అనేది ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి సందర్భంలోనే కన్నప్ప సినిమా మీద భారీగా ఎఫెక్ట్ పడి అవకాశాలైతే ఉన్నాయి.
మంచు ఫ్యామిలీ అంటేనే కొంచెం అతిగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎలాంటి సందర్భంలో ఏ విషయాల స్పందించాలి అనే విషయం కూడా వాళ్లకు తెలీదు. అది తెలిసి ఉంటే ప్రభాస్ గురించి ఇలాంటి కామెంట్లు చేసి ఉండడు అని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ అభిమానులు కన్నప్ప సినిమా చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్న సందర్భంలో ఆయన ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల అసలు ఆయన అభిమానులు ఈ సినిమాను చూసే అవకాశం లేకుండా పోతుందనే చెప్పాలి…
Also Read : కన్నప్ప స్వగ్రామం వెళ్లిన మంచు విష్ణు… గ్రామ ప్రజలకు కీలక హామీ!