Chiranjeevi and Anil Ravipudi : మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమా తొందర్లోనే సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. ఈ మూవీ కోసం యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి చిరంజీవి లాంటి ఒక స్టార్ హీరోను అనిల్ రావిపూడి ఎలా చూపిస్తాడు. తద్వారా ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాలను తెలుసుకోవడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడు కూడా ఆసక్తి ఎదురు చూస్తూ ఉండడం విశేషం.
Also Read : చిరంజీవి అనిల్ రావిపూడి మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?
ఇక ఇప్పటివరకు అనిల్ రావిపూడి(Anil Ravipudi) చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇప్పటి వరకు ఒకలెక్క ఇక మీదట మరోలెక్క గా మారబోతున్నాయి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) లాంటి హీరోతో ఆయన ఎలాంటి సినిమా చేస్తాడు. కమర్షియల్ గా ఈ సినిమా ఎలా వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశ్యం లోనే చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…ఇక ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఈ మూవీ దాదాపు 350 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడమే కాకుండా ఈ సినిమా అనిల్ రావిపూడి కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలిచింది. మరి ఇప్పుడు చిరంజీవి చేయబోతున్న సినిమా కూడా అదే మాదిరిగా భారీ విజయాన్ని సాధించబోతుందనే ఒక నమ్మక అయితే అందరిలో కలుగుతుంది. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు చిరంజీవి సినిమా కోసం ఆయన చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నట్లుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన చేయబోతున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధించాయి. తద్వారా ఆయన కంటూ ఎలాంటి గుర్తింపును సంపాదించుకోబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక చిరంజీవి అనిల్ రావిపూడి కి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకే ఆయన ఎలా చెబితే అలా నటించడానికి చిరంజీవి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటికి స్టోరీ మొత్తం ఫైనల్ అయిపోయిన ఈ సినిమా వచ్చే నెల నుంచి సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ కూడా ఉందట. మాస్ ప్రేక్షకులను అలరించడానికి అలాగే చిరంజీవి లాంటి స్టార్ హీరో సినిమాలో ఒక మాస్ బీట్ ఉంటే బాగుంటుంది అలాగే ఒక ఐటెం సాంగ్ ఉంటే కూడా ఉంటే ప్రేక్షకులందరు ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశ్యంతో ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారట.
ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా(Urvashi Routela) తో సాంగ్ చేయించే ప్లాన్ లో దర్శకుడు ఉన్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా ఆమె ఐటెం సాంగ్ లో నటించింది. మరి ఈ సినిమాలో కూడా నటిస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
Also Read : రేపే చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ ప్రారంభోత్సవం..ముఖ్య అతిథి ఎవరంటే!