Mahesh Babu- Rajamouli: మహేష్ తో రాజమౌళి చేసే మూవీ కథేంటి? జోనర్ ఏంటీ? అనే ప్రశ్నలు అభిమానులను తొలిచేస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. అధికారికంగా మహేష్ కాని, రాజమౌళి కానీ ఓ స్పష్టత ఇవ్వలేదు. అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడు ఆ సంగతేంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. మేజర్ మూవీకి మహేష్ నిర్మాతగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు, ఈ క్రమంలో ఆయనకు రాజమౌళి ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ఓ బాలీవుడ్ మీడియా యాంకర్ మరోసారి ఈ ప్రశ్న మహేష్ పై సంధించారు. ఆయన మాట్లాడుతూ… రైటర్ విజయేంద్రప్రసాద్ మీకోసం ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్స్ కూడిన కథ సిద్ధం చేశారని ఓ ఇంటరాక్షన్ నాతో చెప్పారు. దీనిపై మీ ఫీలింగ్ ఏమిటీ? అని అడిగారు. ఆఫ్రికన్ అడ్వెంచర్స్ మాత్రమే కాదు ఇంకా కొన్ని స్టోరీ లైన్స్ చెప్పడం జరిగింది. కానీ వాటిలో ఏది అనేది ఇంకా ఫైనల్ చేయలేదు. కాబట్టి రాజమౌళి మూవీ ఏ జోనర్ లో ఉంటుందని చెప్పడానికి ఇది సరైన సమయం కాదు. అయితే రాజమౌళితో మూవీ చేయాలనే నా కల నెరవేరబోతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం నేను చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నాను.. అని మహేష్ ముగించారు.
ఆయన కామెంట్స్ ప్రకారం రైటర్ విజయేంద్రప్రసాద్ మహేష్ కోసం సిద్ధం చేసిన కథల్లో ఆఫ్రికన్ అడ్వెంచరస్ జోనర్ ఒకటి. అయితే అదే ఫైనల్ కాదు. సిద్ధంగా ఉన్న కథల్లో మహేష్ కోసం రాజమౌళి ఓ కథను ఎంపిక చేస్తారని తెలుస్తుంది.ఇక రాజమౌళి గత చిత్రాలకు మించి భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. 2023లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కే సూచనలు కలవు. ఇక రాజమౌళి సినిమా అంటే కనీసం రెండేళ్ల సమయం కేటాయించాల్సిందే.

ఈ లోపు మహేష్ త్రివిక్రమ్ మూవీ పూర్తి చేయనున్నాడు. మహేష్ 28వ చిత్రంగా తెరకెక్కతున్న ఈ చిత్రం జులై నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా హైదరాబాద్ శివార్లలో ఓ భారీ కాలనీ సెట్ నిర్మిస్తున్నారట. ఈ మూవీలో మహేష్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. అయితే ఆమెను ప్రాజెక్ట్ నుండి తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో మహేష్-పూజా కాంబినేషన్ లో మహర్షి చిత్రం తెరకెక్కింది.
Also Read:Aadhi Pinisetty: హాట్ టాపిక్ గా నటుడు ఆది వరకట్నం… అన్ని కోట్లు తీసుకున్నాడా!
[…] […]
[…] […]
[…] […]
[…] […]