https://oktelugu.com/

Bigg Boss Telugu 8: నిఖిల్ కి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పిన గౌతమ్..చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఎం లాభం!

నిఖిల్ ని నోరు మూసుకొని కూర్చోరా అంటూ సంబోధించాడు. నిఖిల్ కూడా తేజ ని వాడుకున్నావ్ అని గౌతమ్ ని తిట్టాడు, కానీ ఆడవాళ్ళతో ఆడుకున్నావ్ వంటి పదాలు ఉపయోగించాడు. అది గౌతమ్ కి వాడుకున్నావ్ అన్నట్టుగా వినిపించింది. అందుకే ఆయన తిరగబడి నువ్వు యష్మీ ని వాడుకున్నావ్ అని అంటాడు

Written By:
  • Vicky
  • , Updated On : December 4, 2024 / 08:00 AM IST

    Bigg Boss Telugu 8(260)

    Follow us on

    Bigg Boss Telugu 8: నిన్న జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో నిఖిల్, గౌతమ్ మధ్య ఏ రేంజ్ గొడవలు జరిగాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సీత బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ వేయడానికి వచ్చినప్పుడు నిఖిల్ స్ట్రాంగ్ అమ్మాయిలను వాడుకుంటున్నాడని, వాళ్ళ గేమ్ ని తగ్గించే ప్లాన్ చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. యష్మీ కి సరైన రీతిలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా ఆమెని అయ్యోమయ్యం లోకి నెట్టేసి గేమ్ ని పూర్తిగా నాశనం చేసాడని, ఫలితంగా ఆమె డేంజర్ జోన్ లోకి రావాల్సి వచ్చిందని ఇలా ఎన్నో రకాల ఆరోపణలు చేసింది. దీనికి యష్మీ సరైన స్టాండ్ తీసుకోకపోవడం వల్ల ఆమెకి నెగటివిటీ పీక్ రేంజ్ లో పెరిగి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అలాంటి సున్నితమైన అంశాన్ని నామినేషన్స్ లో గౌతమ్ మళ్ళీ తీసుకొచ్చాడు. యష్మీ నీ గేమ్ కోసం వాడుకున్నావ్ అంటూ మరోసారి సంచలన ఆరోపణలు చేసాడు.

    ఆ తర్వాత నిఖిల్ ని నోరు మూసుకొని కూర్చోరా అంటూ సంబోధించాడు. నిఖిల్ కూడా తేజ ని వాడుకున్నావ్ అని గౌతమ్ ని తిట్టాడు, కానీ ఆడవాళ్ళతో ఆడుకున్నావ్ వంటి పదాలు ఉపయోగించాడు. అది గౌతమ్ కి వాడుకున్నావ్ అన్నట్టుగా వినిపించింది. అందుకే ఆయన తిరగబడి నువ్వు యష్మీ ని వాడుకున్నావ్ అని అంటాడు. దీనికి నిఖిల్ కూడా ఆవేశం లో అది చేసింది నువ్వు, టేస్టీ తేజ ని కూడా వాడుకున్నావ్, ఆ విషయం ఇక్కడున్న వాళ్లందరికీ తెలుసు అని అంటాడు. అలా వీళ్లిద్దరి మధ్య మాటలు హద్దులు మీరుతాయి. ఒకానొక సమయంలో గౌతమ్ కి కోపం అదుపుతప్పి మూసుకొని కూర్చో అని అంటాడు. దానికి నిఖిల్ మాట్లాడుతూ ‘ఎం అన్నావ్ రా..మళ్ళీ చెప్పు’ అని కోపం తో కొట్టేలాగా మీదకు వెళ్తాడు. ఇంకోసారి నోరు జారితే పరిస్థితి వేరేలా ఉంటుంది అని అంటాడు. ఇక్కడ గౌతమ్ ఉద్దేశపూర్వకంగా నిఖిల్ ని తిట్టాడో, లేకపోతే నిజంగా అపోహపడి తిట్టాడో అనేది తెలియాల్సి ఉంది.

    అయితే దీనిపై నిన్నటి ఎపిసోడ్ లో గౌతమ్ నిఖిల్ కి బహిరంగంగా క్షమాపణలు చెప్తూ , ఇక ఎప్పటికీ ఇలాంటి పదాలను ఉపయోగించను అని, నన్ను మనస్ఫూర్తిగా క్షమించు అంటూ గౌతమ్ నిఖిల్ కి క్షమాపణలు చెప్తాడు. అప్పుడు నిఖిల్ నేనెప్పుడూ అలా నోరు జారను, కానీ నేను కూడా ఆ కోపం నిన్ను మూసుకొని కూర్చోమని అన్నాను, దానికి నా క్షమాపణలు అని అంటాడు. ఆ తర్వాత ఇద్దరు ఒకరిని ఒకరు కౌగలించుకొని స్నేహితులు అవుతారు. కానీ గౌతమ్ కి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆయన ఓటింగ్ గ్రాఫ్ కచ్చితంగా పడిపోయి ఉంటుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. గత సీజన్ లో పల్లవి ప్రశాంత్ పట్ల అమర్ దీప్ చేసిన తప్పే, ఈ సీజన్ లో నిఖిల్ పట్ల గౌతమ్ తప్పు చేసాడు, ఇక టైటిల్ గౌతమ్ కి ఫిక్స్ అయిపోయినట్టే.