Chiranjeevi And Srikanth Odela: దసర సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల… ప్రస్తుతం నానితో ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని మూట గట్టుకుంటాడా? ఆయనకంటూ ఒక క్రేజ్ క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే… అయితే శ్రీకాంత్ ఓదెల తను తదుపరి సినిమాని చిరంజీవితో చేయడానికి కమిట్ అయ్యాడు. చిరంజీవి లాంటి స్టార్ హీరోతో అవకాశం వచ్చినప్పుడు డిఫరెంట్ కధతో ప్రేక్షకుల ముందుకు వస్తే టాప్ డైరెక్టర్ గా నిలిచిపోతామనే ఉద్దేశ్యం శ్రీకాంత్ ఓదెలకు ఉంది. అందువల్లే అతను చిరంజీవితో చేయబోతున్న సినిమా కోసం డిఫరెంట్ కథను ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. శ్రీకాంత్ అసలు ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అనేది ఇప్పుడు చర్చనీయంశం గా మారింది.
ఒకరకంగా చెప్పాలంటే శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు ప్యారడైజ్ సినిమాతో బోల్డ్ కంటెంట్ సినిమాని చేస్తున్నాడు. చిరంజీవికి సెట్ అయ్యే కథను చేస్తాడా? మరి చిరంజీవి సైతం అతని కథలో ఏమైనా మార్పులు చేర్పులు చేయమని కండిషన్స్ పెడతాడా? దీనివల్ల వీళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఒకరకంగా ఈ సినిమా పట్టాలెక్కుతుందా?
లేదా అనే అనుమానాలు కూడా చాలా మందిలో వ్యక్తం అవుతున్నాయి… ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల పేరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చాలామంది స్టార్ హీరోలు అతనితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. శ్రీకాంత్ లాంటి దర్శకుడు దొరికితే డిఫరెంట్ ప్రయత్నం చేయాలని చూస్తున్న క్రమంలో చిరంజీవి శ్రీకాంత్ చెప్పే కథను ఒప్పుకుంటాడా?
మరి అతనితో సినిమా చేస్తాడా?వీళ్ళిద్దరి మధ్య క్లాషేష్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇండియన్ ఇబ్బంది జరిగితే శ్రీకాంత్ ఈ మూవీ నుంచి తప్పుకుని వేరే హీరోతో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా? అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే శ్రీకాంత్ కి చిరంజీవికి సెట్ అవుతుందా? అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి…