IPhone 17 Vs One Plus 15: ప్రస్తుత కాలంలో మొబైల్ ప్రధాన అవసరంగా మారింది. సొంత అవసరాలతో పాటు కార్యాలయ అవసరాలకు మొబైల్ లేకుండా పనులు జరగడం లేదు. ఇలాంటి సమయంలో మంచి ఫోన్ కొనాలని చాలామంది చూస్తుంటారు. అయితే ఏ మొబైల్ బెటర్? అన్న సందేహం చాలా మందికి వస్తుంది. ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నదేంటంటే iphone అన్నిటికంటే బెటర్ అని కొందరు చెబుతున్నారు. కానీ Oneplus వంటి మొబైల్స్ కూడా ఐఫోన్ వలే క్వాలిటీతో పాటు ఫీచర్స్ ఉంటాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు ఫోన్లో మధ్య తేడా ఏంటి అన్న సందేహం చాలా మందిలో కలుగుతుంది. అయితే ఈ రెండింటి ఫీచర్స్ ఇప్పుడు చూద్దాం..
స్మార్ట్ ఫోన్లలో Oneplus కంపెనీ కి చెందిన డివైస్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. అయినా కూడా ఈ కంపెనీకి చెందిన ఫోన్లు కొనుగోలు చేయాలని చూస్తారు.
Display:
మార్కెట్లో ప్రస్తుతం Oneplus 15 మొబైల్ ఆకట్టుకుంటుంది. ఇందులో డిస్ప్లేను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇది 6.78 LTPO AMOLED డిస్ప్లే ఉంది. దీంతో ఇందులో వీడియోలు చూస్తే వేరే లెవెల్ అన్నట్లుగా ఉంటుంది. ఈ డిస్ప్లే 165 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేయడంతో గేమింగ్ కోరుకునే వారికి కూడా అనుగుణంగా ఉంటుంది. అలాగే 3800 నిట్స్ పిక్ బ్రైట్నెస్ తో ఉండడంతో వాతావరణం ఎలా ఉన్నా వీడియోలు క్వాలిటీగా చూసుకోవచ్చు.
iphone 17 విషయానికి వస్తే ఇందులో 6.3 అంగుళాల XDR OLED డిస్ప్లేను అమర్చారు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఇందులో nits peak బ్రైట్నెస్ ఉండనుంది. దీంతో సింగిల్ హ్యాండ్ తో యూస్ చేసినా స్మూత్ గా మూవ్ అవుతుంది.
Battery:
Oneplus 15 మొబైల్ లో బలమైన బ్యాటరీని అమర్చారు. ఇందులో 7300mAh సిలికాన్ నానో స్టాక్ బ్యాటరీని అమర్చారు. ఇది 120 W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్టు ఇవ్వనుంది. 39 నిమిషాల నుండి 100% చార్జింగ్ అవుతుంది. దీంతో రోజంతా వినియోగించినా కూడా బ్యాటరీ తక్కువగా డౌన్ అవుతుంది. అలాగే 50w వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇవ్వనుంది.
iphone 17 లో 3692 mAh బ్యాటరీని చేర్చారు. ఇది 40 W ఫాస్ట్ ఛార్జింగ్ తో సపోర్ట్ ఇస్తుంది. ఈ మొబైల్లో magsafe ఆప్షన్ ఉండడంతో ఫోన్ సెక్యూరిటీకి ఎలాంటి డోకా ఉండదని చెప్పవచ్చు.
Performance:
Oneplus 15 మొబైల్లో 8 ఎలైట్ జెన్ 5 చిప్సెట్ అమర్చారు. దీంతో 120fps లో గేమ్ ఆడినా కూడా మొబైల్ స్లో అవ్వదు
iphone 17 లో A series చిప్ గేమింగ్ కోసం పనిచేయకపోయినా డైలీ యూజర్స్ కి మాత్రం అనుగుణంగా ఉంటుంది.
Camera:
Oneplus 15 మొబైల్ లో 50MP మెయిన్ కెమెరాను అమర్చారు. ఇవి డిటైల్ మాక్స్ ఇంజన్తో ఉండడం వల్ల అద్భుతమైన ఫోటోలను తీసుకోవచ్చు. పగలు, రాత్రి అని తేడా లేకుండా వాతావరణానికి అనుకూలంగా ఫోటోలు వస్తాయి.4k 120fps లో వీడియోలు తీసుకోవచ్చు.
iphone 17 కెమెరాను ఎవరు బీట్ చేయరని అంటున్నారు. ఎందుకంటే ఇందులో 4కె 60fps వీడియో తీసుకోవచ్చు. అలాగే స్నాప్స్ అన్ని క్వాలిటీతో వస్తాయి
Price:
iphone 17 లో లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్స్ తో పాటు అడ్వాన్స్ టెక్నాలజీ ఉండడంతో దీనిని రీసెల్ చేసుకున్న కూడా ధర వస్తుంది. అయితే వన్ ప్లస్ మొబైల్ లో కూడా బ్లాక్ ఫిష్ ఫీచర్స్ ఉండడంతో ఎక్కువమంది దీనిని కోరుకుంటారు. దీనికి కూడా రీసెల్ వచ్చే అవకాశం ఉంటుంది.
మొత్తంగా ఫాస్ట్ చార్జింగ్, బ్యాటరీ సేవింగ్, క్వాలిటీ వీడియోలు కావాలని కోరుకునే వారు వన్ ప్లస్ 15 మొబైల్ ను ఎంచుకోవచ్చు.