Chiranjeevi And Rajinikanth: సినిమా ఇండస్ట్రీలో సోలో హీరోగా ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కొంతమందికి మాత్రమే ఇక్కడ సూపర్ సక్సెస్ లు దక్కుతాయి. తద్వారా వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో టాప్ హీరోలకి ఎలివేట్ అవుతూ ఉంటారు. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న రజినీకాంత్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ గా తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్న ఆయన ఒక ఊపు ఊపేస్తూ ముందుకు సాగుతున్నాడు. తమిళ్ తో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీని సైతం షేక్ చేసిన ఆయన ప్రస్తుతం మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. రజనీకాంత్ – కమల్ హాసన్ ఇద్దరు కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమా చేయాలని అనుకున్నారు. కానీ అది వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. ఇక ప్రస్తుతం రజినీకాంత్ తన సమకాలీన హీరో అయిన చిరంజీవితో ఒక మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి…
బాబీ డైరెక్షన్లో చిరంజీవి ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమా చేశాడు. అయితే ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న చిరంజీవి మరోసారి బాబీకి అవకాశం ఇచ్చాడు. 2026 ఫిబ్రవరి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. ఈ సినిమాలో రజనీకాంత్ చేత ఒక 30 నిమిషాల క్యారెక్టర్ ని చేయించే ప్రయత్నం చేస్తున్నారట.
మొత్తానికైతే బాబి కనక రజనీకాంత్ చిరంజీవిలను సమపాళ్లలో చూపించినట్టయితే ఆ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక రీసెంట్ గా ‘కూలీ’ సినిమాతో ప్లాప్ ను మూట గట్టుకున్న రజినీకాంత్ ఇప్పుడు ఎలాగైనా సరే సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది. ఇక చిరంజీవి రజనీకాంత్ కాంబినేషన్ అటే అది ఎవరి గ్రీన్ కాంబినేషన్ కాబట్టి దానిని స్క్రీన్ మీద చూడడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
కెరీర్ మొదట్లో వీళ్ళిద్దరూ కలిసి నటించినప్పటికి హీరోలుగా మారిన తర్వాత ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఓకే స్క్రీన్ మీద మాత్రం కనిపించే ప్రయత్నం చేయలేకపోయారు. బాబీ లాంటి ఒక స్టార్ డైరెక్టర్ తన సినిమా కోసం వీళ్ళిద్దరిని కలుపుతాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…