Suriya and Jyothika: ప్రస్తుతం ఉన్న జనరేషన్ మొత్తం ఒంటరిగా ఉండడానికి బాగా ఇష్టపడుతున్నట్టు గా అర్థం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసుకున్న కూడా వివాహ బంధంలో కలిసి ఉండడానికి చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా రాజీ పడలేకపోవడం ఎవరికి వారు స్వేచ్ఛ కావలనుకోవడం వల్ల ఒకరి ఇష్టాలను ఇంకొకరు గౌరవించు కోకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుంది.
ఇక ఈ సమస్య సమాజం లో అందరిలో ఉన్నప్పటికీ సినిమా సెలబ్రిటీలు అనేసరికి అందరికీ చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు కాబట్టి వాళ్లలో ఎవరైనా విడిపోతే మాత్రం అది అందరికీ చాలా విచిత్రంగాను, వింతగాను కనిపిస్తూ ఉంటుంది. స్టార్ హీరోల దగ్గర నుంచి వాళ్ళ పిల్లలు చాలామంది కూడా ఇప్పుడు విడాకులు తీసుకున్నవారు చాలా మంది ఉన్నారు.పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చిరంజీవి కూతురు అయిన శ్రీజ,నాగబాబు కూతురు నిహారిక, నాగార్జున కొడుకు నాగ చైతన్య,రజనీకాంత్ బిడ్డ, మోహన్ బాబు కొడుకు మనోజ్ లాంటి చాలా ప్రముఖులు విడాకుల బాట పట్టడం వల్ల పెళ్లి అనే బంధం మీద ప్రతి ఒక్కరికి ఇంప్రెషన్ అనేది పోతుంది…
ఇక ఇప్పటి వరకు క్యూట్ కపుల్స్ గా చెప్పుకునే సూర్య జ్యోతిక ల మధ్య కూడా విభేదాలు వచ్చినట్టుగా మీడియాలో చాలా కథనాలు వస్తున్నాయి. ఇక అందులో భాగంగానే ఇప్పుడు జ్యోతిక చెన్నై వదిలేసి ముంబైకి వెళ్లి వాళ్ళ పిల్లల్ని కూడా అక్కడే స్కూల్లో జాయిన్ చేయించడం చూస్తుంటే వాళ్ళ మధ్య దూరం బాగా పెరిగిపోతున్నట్టుగా తెలుస్తుంది… అయితే ఈ విషయం మీద జ్యోతిక స్పందిస్తూ నేను మా అమ్మ నాన్నలను చూసుకోవడానికి ముంబై వచ్చి ఇక్కడ ఉంటున్నాను నాకు సూర్యకి మధ్య ఏ గొడవలు లేవు సూర్య చాలా డీసెంట్ పర్సన్ అంటూ సూర్య గురించి చాలా గొప్పగా చెప్తూ తను ఇక్కడికి రావడానికి గల కారణాలను కూడా వివరించింది. అయినప్పటికీ అందులో చాలామంది చాలా రకాల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కొందరైతే మీ అమ్మ నాన్నల్ని మీతో పాటు చెన్నైలో ఉంచుకోవచ్చు కదా అనే ప్రశ్నని లేవనెత్త గా దానికి జ్యోతిక మా అత్తగారింట్లో మా అమ్మ నాన్న ని ఎలా ఉంచుతాను అని సమాధానం చెప్పింది.
అలాగే మరి మీ పిల్లల్ని చెన్నైలో ఉంచి అక్కడే చదివించవచ్చు కదా అంటే నేను ఎక్కడుంటే వాళ్ళు కూడా అక్కడే ఉంటారు వాళ్ళ బాగోగులు నేనే కదా చూసుకోవాల్సింది అంటూ తను సమాధానం చెప్పింది. మరి మీరు ఇక్కడ ఉంటే సూర్య అక్కడ ఒంటరి గా ఉంటారి వాడు అయిపోతాడు కదా అని అడిగిన ప్రశ్నకి ఆమె సమాధానం చెప్పకుండా కామ్ గా ఉండిపోయింది. అంటే క్యూట్ కపుల్స్ గా చెప్పుకునే వీళ్ళ మధ్య కూడా విడాకులు అనే ఒక చిచ్చు రేగుతుందా అనేది సూర్య అభిమానులతో పాటు సగటు ప్రేక్షకున్ని కూడా తీవ్రంగా కలిచి వేస్తుంది.మరి వీళ్ళ పయనం ఎటువైపు ఉందో చూడాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు…