మరో మల్టీ స్టారర్ చిరంజీవి తో అల్లు అర్జున్

తెలుగులో మల్టీ స్టారర్ ల సీజన్ నడుస్తున్నట్టు వుంది. వరుసగా మల్టీ స్టారర్ చిత్రాలకు నిర్మాతలు క్యూ కడుతున్నారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రం ‘ఆచార్య’లో రామ్ చరణ్ నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణెదల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ మూవీస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే రవితేజ , రానా దగ్గుబాటి కూడా ఒక మల్టీ స్టారర్ చిత్రం లో నటిస్తున్నారు . `అయ్యప్పనుం […]

Written By: admin, Updated On : April 18, 2020 5:52 pm
Follow us on


తెలుగులో మల్టీ స్టారర్ ల సీజన్ నడుస్తున్నట్టు వుంది. వరుసగా మల్టీ స్టారర్ చిత్రాలకు నిర్మాతలు క్యూ కడుతున్నారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రం ‘ఆచార్య’లో రామ్ చరణ్ నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణెదల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ మూవీస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే రవితేజ , రానా దగ్గుబాటి కూడా ఒక మల్టీ స్టారర్ చిత్రం లో నటిస్తున్నారు . `అయ్యప్పనుం కోషియుమ్ `అనే మళయాళ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తయారౌతుంది. రమేష్ వర్మ దర్శకత్వం లో రూపొందే ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించ బోతుంది. అలాగే పవన్ కళ్యాణ్ , రవి తేజ కాంబో లో కూడా ఒక ముల్టీస్టారర్ నిర్మించే ప్లాన్ ఉంది . కాగా ఈ చిత్రాన్ని నేల టికెట్ , డిస్కో రాజా చిత్రాల నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించాలని ఉవ్విల్లూరు తున్నాడు .

ఇవన్నీ ఒకెత్తయితే భారీ మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్ `( రౌద్రం రణం రుధిరం ) షూటింగ్ దశలో ఉంది అలాగే నాని నటించిన ” వి ” చిత్రం కూడా మల్టీ స్టారర్ అనే చెప్పాలి .

అలా మల్టీ స్టారర్ చిత్రాల వెల్లువ తెలుగు సినీ రంగాన్ని ముంచెత్తుతోంది . కాగా ప్రస్తుతం `ఆచార్య ` చిత్రం తరవాత చిరంజీవి చేయబోయే సినిమా కూడా మల్టీ స్టారర్ అనే చెప్పాలి. ‘లూసిఫర్’ అనే మళయాళ చిత్రానికి రీమేక్ గా రూపొందే ఈ చిత్రం లో చిరంజీవి తో పాటు అల్లు అర్జున్ కూడా నటించ బోతున్నాడు. అని తెలిసింది. మళయాళం లో మోహన్ లాల్ నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం లో రెండో హీరోగా పృథ్వీరాజ్ నటించడం జరిగింది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మించ బోతున్న ఈ తెలుగు రీమేక్ చిత్రాన్ని ‘సాహో’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది .

Also Read: సీసీసీకి నిర్మాత మోహ‌న్ చెరుకూరి విరాళం
సి.సి.సి కి రామోజీరావు విరాళం