మంత్రులే లేకుండా శివరాజ్ చౌహన్ రికార్డు

మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అనేక రికార్డు లను ఇది వరకే బద్దలు చేశారు. కొద్దీ నెలల క్రితం మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ సుదీర్ఘకాలం, 14 ఏళ్లకు పైగా విరామం లేకుండా దేశం మొత్తంలో ముఖ్యమంత్రి పదవిలో ఉన్న బిజెపి నాయకుడిగా రికార్డు సృష్టించారు. ఆర్ధిక సంస్కరణల నేపథ్యంలో వృద్ధిలో గ్రామాలు, వ్యవసాయం తీవ్ర నిర్లక్ష్యాలకు గురిచేస్తూ, ఆ రంగాలలో ప్రతికూల అభివృద్ధిని దేశంలో అందరూ నమోదు చేస్తుండగా తాను ముఖ్యమంత్రిగా ఉన్నదా […]

Written By: Neelambaram, Updated On : April 18, 2020 10:56 am
Follow us on


మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అనేక రికార్డు లను ఇది వరకే బద్దలు చేశారు. కొద్దీ నెలల క్రితం మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ సుదీర్ఘకాలం, 14 ఏళ్లకు పైగా విరామం లేకుండా దేశం మొత్తంలో ముఖ్యమంత్రి పదవిలో ఉన్న బిజెపి నాయకుడిగా రికార్డు సృష్టించారు.

ఆర్ధిక సంస్కరణల నేపథ్యంలో వృద్ధిలో గ్రామాలు, వ్యవసాయం తీవ్ర నిర్లక్ష్యాలకు గురిచేస్తూ, ఆ రంగాలలో ప్రతికూల అభివృద్ధిని దేశంలో అందరూ నమోదు చేస్తుండగా తాను ముఖ్యమంత్రిగా ఉన్నదా ఆ రంగాలకు మంచి ప్రాధాన్యత ఇచ్చి చరిత్ర సృష్టించారు. దేశం అంతా వ్యవసాయ రంగంలో 2 లేదా 3 శాతానికి ముంచి దశాబ్దాలుగా వృద్ధి సాధించని పరిస్థితులలో 10 శాతంకు పైగా సాధించి రికార్డు నెలకొల్పారు.

ప్రస్తుతం అసలు మంత్రులు ఎవ్వరు లేకుండా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేతగా దేశంలో తాజాగా రికార్డు సృష్టిస్తున్నారు. లాక్ డౌన్ విధించడానికి రెండు రోజుల ముందు హడావుడిగా గత నెల 23న ముఖ్యమంత్రిగా ప్రమాణాస్వీకారం చేశారు. అప్పటి నుండి మంత్రివర్గ విస్తరణ లేకుండా 26 రోజులుగా ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటి వరకు దేశంలో ఎక్కువకాలం – 24 నాలుగు రోజుల పాటు మంత్రువర్గం లేకుండా ముఖ్యమంత్రిగా కొనసాగిన ఘనత కర్ణాటక ముఖ్యమంత్రి బి ఎస్ యడియూరప్ప రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు ఆ రికార్డు ను చౌహన్ బద్దలు చేసిన్నట్లు అయింది.

ఈ సందర్భంగా కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వివేక్ తంఖా ఓ ట్వీట్‌లో చౌహన్ ను అవహేళన చేశారు. ‘శివరాజ్‌జీ..మీకు అభినందనలు. ఎంపీలోని ప్రస్తుత విషాద పరిస్థితుల్లో మీరు మంత్రులు లేకుండా ఎక్కువ కాలం సేవలందించిన సీఎంగా భారత్ లోనే సరికొత్త రికార్డు సృష్టించారు. 24 రోజుల రికార్డు గతంలో యడియూరప్ప పేరు మీద ఉంది”అంటూ పేర్కొన్నారు.

పైగా, “ఇద్దరి మధ్యా ఓ పోలిక కూడా ఉంది. ఇద్దరూ నాలుగోసారి ముఖ్యమంత్రులుగా ఫిరాయింపుదారుల సహకారంతో ప్రభుత్వాలు ఏర్పరచిన వారే” అంటూ తంఖా తన ట్వీట్ లో ఎద్దేవా చేశారు. అనుచిత పద్ధతుల్లో కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూల్చారంటూ విమర్శలు గుప్పించారు.

వాస్తవానికి మంత్రివర్గం విస్తరించడం కోసం ఇప్పటికే పలు దఫాలుగా బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపిన సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ ఆ చర్చలు ఒక కొలిక్కి రాకపోవడంతో నిస్సహాయంగా ఉండిపోయిన్నట్లు తెలుస్తున్నది. మొదటి విడతలో కనీసం వచ్చేవారమైన కీలకమైన శాఖలను సీనియర్లకు ఇవ్వాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు.