Chiranjeevi: జీవితం లో పైకి ఎదగాలని అనుకునే వాళ్లకు మెగాస్టార్ చిరంజీవి ఒక ఆదర్శం అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అంతే కాదు వయస్సు పెరిగిపోయింది , ఇక మన పరిమితి ని తగ్గించుకోవాలి అని అనుకునే వాళ్లకు కూడా మెగా స్టార్ చిరంజీవి ఒక గొప్ప ఆదర్శప్రాయులు. ఆయన వయస్సు ప్రస్తుతానికి 70 ఏళ్ళు. ఈ వయస్సులో కూడా ఆయన కుర్ర హీరోలతో సమానంగా పోటీ పడుతూ సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. సినిమాలు చేయడమే కాదు , ఈ వయస్సులో కూడా ఆయన ఫైట్స్ , డ్యాన్స్ చేస్తూ వందల కోట్ల గ్రాస్ వసూళ్లను అవలీలగా కొల్లగొడుతూ ముందుకు దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ బాబీ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇది.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. రీసెంట్ గా షూట్ చేసిన ఒక సందర్భాన్ని చెప్తే ఈ వయస్సులోనే చిరంజీవి ఇంత కష్టపడితే, మనం ఎంత కష్టపడాలి , ఎంత కసిగా పనిచేయాలి అనేది అర్థం చేసుకుంటారు. ఈ చిత్రం లో కీలకంగా వచ్చే ఒక వర్షన్ ఫైట్ సన్నివేశం ఉంటుందట. ఈ సన్నివేశాన్ని దాదాపుగా 12 గంటల పాటు చిత్రీకరించారట. చిరంజీవి 70 ఏళ్ళ వయస్సులో ఎలాంటి డూప్ ని వాడకుండా, 12 గంటలు స్వయంగా షూటింగ్ చేశారట. కాసేపు వర్షం లో తడిస్తేనే ఏ రోగం వస్తుందో బాబోయ్ అని ఇంట్లోనే కూర్చుంటాం మనం , అలాంటిది చిరంజీవి పని కోసం ఇంత డేడికేట్ గా ఈ వయస్సు లో కూడా కష్టపడడం చూసి మనం కూడా నేర్చుకోవాలి. ఈ వయస్సులో ఆయనకు ఇంత కష్టపడాల్సిన అవసరం ఏంటి చెప్పండి?.
కొడుకు ఈ జనరేషన్ లో పాన్ ఇండియా లెవెల్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ , వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి , సంతోషంగా మనవడు మానవరాళ్లతో ఆడుకుంటూ చిరంజీవి ఇంట్లో సమయం గడిపేయొచ్చు. కానీ పని అంటే పిచ్చి ఉన్న చిరంజీవి ఆ పని చేయడం లేదు , పని లేకపోతే నాకు పిచ్చెక్కిపోతాది , అందుకే సినిమాలు చేస్తున్నాను అని రీసెంట్ గా కూడా ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. పని ని ఆ విధంగా ఇష్టపడుతున్నారు కాబట్టే , ఈ వయస్సులో కూడా ఎంటర్టైన్ చేస్తూ అవలీలగా 300 కోట్ల గ్రాస్ ని కొల్లగొడుతున్నారు మెగాస్టార్. ఇలా ప్రతీ రంగం లోనూ పని చేసే యువత కష్టపడితే , జీవితం లో ఎవ్వరూ అందుకోలేనంత స్థాయికి ఎదుగుతారని సోషల్ మీడియా లో విశ్లేషకులు అంటున్నారు.
