Ajith : అజిత్ కూతురు అనూష్క బయట చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. 17 ఏళ్లు ఉన్న అజిత్ గారాల పట్టి లేటెస్ట్ గా తన తండ్రి గుడ్ బాడ్ అగ్లీ సినిమా చూసేందుకు మొదటి రోజు మొదటి షో థియేటర్ కు వచ్చింది. ప్రస్తుతం ఈమె తన తల్లితో కలిసి ఉన్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం టీనేజ్ లో ఉన్న అనుష్క అందంలో తన తల్లితో పోటీపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ వీళ్ళిద్దరూ తల్లి కూతుర్ల లాగా కాకుండా అక్కాచెల్లెళ్ల ఉన్నారంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కోలీవుడ్ నటుడు అజిత్ కుమార్ తన ఫ్యామిలీకి చాలా ప్రాధాన్యత ఇస్తాడు. సినిమాలలో అతను ఎంత బిజీగా ఉన్నా కూడా తన ఫ్యామిలీతో కూడా ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాడు. చాలా అరుదుగా అజిత్ కుటుంబం మీడియా ముందు కనిపిస్తుంది. ముఖ్యంగా అయితే అజిత్ కుమార్ కూతురు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండదు. కానీ ఏప్రిల్ 10వ తేదీన అజిత్ కుమార్ కూతురు బహిరంగ కనిపించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈమెను చూసిన అభిమానులు తల్లితండ్రుల అందాన్ని సొంతం చేసుకుంది అంటే సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. వీడియో చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనుష్క తన తల్లి శాలినితో కలిసి తన తండ్రి నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను మొదటి రోజు మొదటి షో చూడడానికి థియేటర్కు వచ్చారు.
Also Read : చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్ ఏంటో తెలిసిపోయిందా..?
అజిత్ కుమార్ నటించిన ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో హీరో అజిత్ కుమార్ సీరియస్ మెసేజ్ చేసే వ్యక్తిగా కనిపిస్తాడు. ఆయన అభిమానులకు ఈ సినిమా బాగా నచ్చినట్లు తెలుస్తోంది. తన తండ్రి నటించిన సినిమాను తల్లితో కలిసి థియేటర్లో చూడడానికి అజిత్ కుమార్ గారాలపట్టి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది అని చెప్పొచ్చు. ప్రస్తుతం అనుష్కకి 17 సంవత్సరాలు.
తన తల్లి శాలినితో కలిసి ఆమె గుడ్ బాడ్ అగ్లీ సినిమాను థియేటర్లో చూడడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న అభిమానులు ఆమె వీడియోను చిత్రీకరించారు. ఎరుపు రంగు టాప్, నల్ల ప్యాంట్ ధరించి థియేటర్ కు వచ్చిన అనుష్క కెమెరాలను చూసి చిరునవ్వు నవ్విన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. నవీన్ యెర్నేని అలాగే వై రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. జీవి ప్రకాష్ సంగీతం వహించారు.
Anni Pathachu pesuyachu..
Woow Woow wat a day. #GoodBadUgly #AjithKumar pic.twitter.com/hE6PaEvCjh— GoodBadUgly (@AkkshayKiron) April 10, 2025