https://oktelugu.com/

RRR Pre Release Event: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం రంగంలోకి ముఖ్యమంత్రి.. ఇండియాలోనే ఇదో సంచలనం..

RRR Pre Release Event: రాజమౌళి చెక్కిన ఆర్.ఆర్ ఆర్ మాయా ప్రపంచాన్ని చూసేందుకు సినీ జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడిన ఈ మూవీ ఈనెల మార్చి 25న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. చరణ్, తారక్ లో అభిమానులతో పాటు ప్రపంచ సినీ జనాలు ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో చూస్తున్నారు. ఇక సినిమాకు హైప్ తీసుకు వచ్చే పనిలో పడ్డారు జక్కన అండ్ టీం. […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 16, 2022 / 04:40 PM IST

    RRR

    Follow us on

    RRR Pre Release Event: రాజమౌళి చెక్కిన ఆర్.ఆర్ ఆర్ మాయా ప్రపంచాన్ని చూసేందుకు సినీ జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడిన ఈ మూవీ ఈనెల మార్చి 25న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. చరణ్, తారక్ లో అభిమానులతో పాటు ప్రపంచ సినీ జనాలు ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో చూస్తున్నారు.

    RRR

    ఇక సినిమాకు హైప్ తీసుకు వచ్చే పనిలో పడ్డారు జక్కన అండ్ టీం. ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి కలిసి ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఎత్తరజెండా పాటతో రెండో విడత ప్రమోషన్స్ మొదలుపెట్టిన జక్కన్న.. అనుకున్నట్టుగానే జనాలను మళ్లీ తన మూవీ గురించి మాట్లాడుకునేలా చేస్తున్నారు. మొన్నటి వరకు రాధే శ్యామ్ గురించి మాట్లాడిన సినీజనాలు.. ఇప్పుడు జక్కన్న జపం చేస్తున్నారు.

    Also Read: కృతిశెట్టే కావాలంటున్న ప్రభాస్.. కారణం అదే

    అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ సంచలన విషయం తెలిసిపోయింది. అందరూ అనుకున్నట్టుగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మార్చి 19న కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ లో నిర్వహించనున్నారు. అధికారికంగా ప్రకటన కూడా చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ ను నిర్వహిస్తే అభిమానులను కంట్రోల్ చేయడం చాలా కష్టం అని భావించిన రాజమౌళి.. చిక్కబల్లాపూర్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

    RRR

    ఈ చిక్కబల్లాపూర్ ఆంధ్ర, కర్ణాటక బార్డర్ లో ఉంటుంది. ఈ ప్రాంతంలో చరణ్, ఎన్టీఆర్ కు భారీ ఫాలోయింగ్ కూడా ఉంది. కాబ‌ట్టి రెండు రాష్ట్రాల్లో ఈవెంట్ నిర్వ‌హంచిన‌ట్టు ఉంటుంద‌ని జ‌క్క‌న్న ప్లాన్ వేస్తున్నాడంట. అంతే కాకుడా దేశంలోనే అతిపెద్ద ఈవెంట్ గా నిర్వ‌హిస్తున్న దీనికి క‌ర్ణాట‌క సీఎం బ‌స‌వ‌రాజు బొమ్మై కూడా వ‌స్తున్నాడంట‌. ఆరోగ్య‌శాఖ మంత్రితో పాటు సూప‌ర్ స్టార్ శివ‌రాజ్ కుమార్ వ‌స్తున్నారంట‌. ఇలా అన్ని ర‌కాలుగా జ‌క్క‌న్న భారీ ప్లాన్ వేస్తున్నాడంట‌.

    Also Read:  టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్

    Tags