https://oktelugu.com/

KTR Challenging On Kishan Reddy:  బస్తీమే సవాల్.. కిషన్ రెడ్డిని సన్మానిస్తానంటున్న కేటీఆర్ .. కారణమిదే..

KTR Challenging On Kishan Reddy:  బీజేపీ ఎంత దూకుడుగా వెళుతున్నా సరే తగ్గేదేలే అంటూ మంత్రి కేటీఆర్ సైతం వెనకడుగు వేయడం లేదు. తగ్గేదేలే అంటూ ముందుకెళుతున్నారు. హైదరాబాద్ వరదల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ తాజాగా ఎండగట్టారు. కేంద్రంలోని బీజేపీకి ఓటేసి గెలిపిస్తే హైదరాబాద్ వరద కష్టాలు తీరుస్తామని నాడు బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఇప్పటివరకూ దీనిపై నిధులు తెచ్చింది లేదు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజాగా కేటీఆర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 16, 2022 5:36 pm
    Follow us on

    KTR Challenging On Kishan Reddy:  బీజేపీ ఎంత దూకుడుగా వెళుతున్నా సరే తగ్గేదేలే అంటూ మంత్రి కేటీఆర్ సైతం వెనకడుగు వేయడం లేదు. తగ్గేదేలే అంటూ ముందుకెళుతున్నారు. హైదరాబాద్ వరదల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ తాజాగా ఎండగట్టారు. కేంద్రంలోని బీజేపీకి ఓటేసి గెలిపిస్తే హైదరాబాద్ వరద కష్టాలు తీరుస్తామని నాడు బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఇప్పటివరకూ దీనిపై నిధులు తెచ్చింది లేదు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజాగా కేటీఆర్ సవాల్ విసిరారు.అదిప్పుడు వైరల్ గా మారింది.

     KTR Challenging On Kishan Reddy

    KTR, Kishan Reddy

    హైదరాబాద్ నగరంలో వరద ముంపు సమస్య పరిష్కారానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రూ.10వేల కోట్లు నిధులు తేవాలని.. అలా తెస్తే పౌరసన్మానం చేస్తానని మంత్రి కేటీఆర్ సంచలన ప్రతిపాదన చేశారు. అందరి ముందే సన్మానం చేస్తానన్నారు. హామీ ఇచ్చి మరీ పెడచెవిన పెడుతున్నారని.. దమ్ముంటే హైదరాబాద్ అభివృద్ధికి బీజేపీ నేతలు పోటీపడాలని చురకలంటించారు.

    Also Read: Sajjanar Tweet About RRR: ఎత్త‌ర‌జెండా పాట‌ను కూడా వ‌ద‌ల‌ని స‌జ్జ‌నార్‌.. ఇలా వాడేశాడే

    ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ నిర్మించిన అండర్ పాస్, బైరామల్ గూడ ఫ్లై ఓవర్ లను కేటీఆర్ ప్రారంభించారు. నాగోల్, బండ్లగూడ లో నాలాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. వరద ముంపు నివారణకు రూ.103 కోట్లతో నాలాలు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

    గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేస్తామన్నారు. ఎల్బీ నగర్ లో స్థలాల రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెండు, మూడు నెలల్లో కొత్త పింఛన్లు ఇస్తామన్న మంత్రి.. అభివృద్ధి చేసేందుకు బీజేపీ కార్పొరేటర్లు కూడా ముందుకు రావాలన్నారు. బీజేపీకి ఇదే నా సవాల్ అంటూ విసిరారు. హామీలిచ్చి మరిచిన బీజేపీని, కిషన్ రెడ్డికి సవాల్ చేసి కేటీఆర్ ఇరుకునపెట్టారు. మరి దీనికి కిషన్ రెడ్డి ఎలాంటి కౌంటర్ ఇస్తారన్నది వేచిచూడాలి.

    Also Read: Prabhas with Krithi Shetty: కృతిశెట్టే కావాలంటున్న ప్రభాస్.. కారణం అదే