https://oktelugu.com/

Chava : ‘ఛావా’ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసిందా..?సినిమా ఏంటి అలా ఉంది…ఇలా అయితే కష్టమేనా..?

బాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా ఎలాంటి సక్సెస్ ఫుల్ సినిమాలు రావడం లేదు. ముఖ్యంగా ఖాన్ త్రయం నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి.

Written By: , Updated On : February 12, 2025 / 09:14 AM IST
Chava

Chava

Follow us on

Chava : బాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా ఎలాంటి సక్సెస్ ఫుల్ సినిమాలు రావడం లేదు. ముఖ్యంగా ఖాన్ త్రయం నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. ఇక షారుక్ ఖాన్ (Sharukh Khan) నుంచి వచ్చే సినిమాలు ఎంతో కొంత ప్రేక్షకులు ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికి పూర్వ వైభవం సాధించుకోలేకపోతున్నారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమా బాలీవుడ్ లో భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న క్రమంలో అక్కడి సినిమాలను మాత్రం వాళ్లు సక్సెస్ ఫుల్ గా మార్చలేకపోతున్నారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీ వల్ల బాలీవుడ్ కి భారీ డామేజ్ అయితే జరిగిందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ‘ఛత్రపతి శివాజీ’ కొడుకు అయిన ‘శంబాజీ మహారాజ్’ జీవిత కథ ఆధారంగా ‘విక్కీ కౌశల్'(Vicky Koushal), రష్మిక మందాన (Rashmika Mandana) లీడ్ రోల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అవుతున్న సినిమా ఛావా(Chava)… ఇక ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్ అయితే క్రియేట్ అవుతూ వస్తుంది. ముఖ్యంగా ఛావా నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమా మీద సగటు ప్రేక్షకులందరు మంచి అంచనాలను పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా ఫస్ట్ రివ్యూ అయితే వచ్చేసింది…ప్రముఖ క్రిటిక్ ఆయన ‘ఉమర్ సందు’ (Umar Sandhu) ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు. ఆయన ప్రకారం చూసుకుంటే సినిమాలో రక్తపాతం ఎక్కువగా ఉంది కానీ మూవీలో పెద్దగా మ్యాటర్ ఏమీ లేదు అంటూ ఆయన తేల్చేశాడు. అలాగే విక్కీ కౌశల్ యాక్టింగ్ కూడా చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుందని ఆయన మహరాజ్ గెటప్ కి సెట్ అవ్వలేదని అన్నారు.

సినిమా స్టోరీ లో కొన్ని ఫిక్షనల్ గా ఆడ్ చేశారని అది కూడా ప్రేక్షకుడిని పెద్దగా ఎఫెక్ట్ చేయదని చెప్పాడు. ఇక రష్మిక మందాన క్యారెక్టర్ అయితే చూడడానికి అంత పర్ఫెక్ట్ గా లేదని విక్కీ కౌశల్ గెటప్ అంత బాగా కుదరలేదని ఆయన కొన్ని కామెంట్స్ అయితే చేశాడు.

మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయలేదని భారీ కలెక్షన్స్ అయితే కొల్లగొట్టదని ముఖ్యంగా పుష్ప 2 కలెక్షన్స్ ను బీట్ చేయడం చాలా కష్టం అంటూ ఆయన తెలియజేయడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా మరికొద్ది రోజుల్లో థియేటర్లోకి వస్తున్న ఈ సినిమాని చూడడానికి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమా మీద ఉమర్ సందు ఇలాంటి రివ్యూ ఎంతవరకు కరెక్ట్ అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఎంతమంది ఎన్ని కామెంట్లు చేసినా కూడా సినిమాకి ఉండే బజ్ అయితే అలాగే ఉందని కొంతమంది తేల్చి చెప్పేస్తుండడం విశేషం..