https://oktelugu.com/

Chhaava : ఛావా కోసం విక్కీ కౌశల్ అంత కష్టపడ్డడా..?ఆ ఒక్కటి మాత్రం చేయలేకపోయాడట…

సక్సెస్ ఫుల్ హీరోగా రాణించడమంటే అంత ఆషామాషి వ్యవహారమైతే కాదు. దాని కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా హీరో అనేవాడు ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి.

Written By: , Updated On : February 19, 2025 / 10:05 AM IST
Chhaava

Chhaava

Follow us on

Chhaava : సక్సెస్ ఫుల్ హీరోగా రాణించడమంటే అంత ఆషామాషి వ్యవహారమైతే కాదు. దాని కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా హీరో అనేవాడు ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి. అలాంటిప్పుడు మాత్రమే అతనిని చూస్తే సగటు ప్రేక్షకుడికి హీరో అనే ఒక అభిప్రాయమైతే ఏర్పడుతుంది… ఇక అంతకుమించి నటనతో కూడా ప్రేక్షకుడిని మెప్పించగలిగే కెపాసిటి ఉన్నవాళ్లు మాత్రమే ఇక్కడ స్టార్ హీరోలుగా వెలుగొందుతూ ఉంటారు…

గత కొంతకాలం నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీకి సరైన సక్సెస్ అయితే రావడం లేదు. ఏ సినిమా వచ్చినా కూడా డిజాస్టర్ గా మిగులుతుంది తప్ప సూపర్ సక్సెస్ ను అయితే సాధించడం లేదు… ఇలాంటి సందర్భంలోనే ఛత్రపతి శివాజీ కొడుకు అయిన శంబాజీ (Shambhaji) మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరికెక్కిన ‘ఛావా ‘ (Chaavaa) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి మంచి టాక్ ని సంపాదించుకోవడమే కాకుండా భారీ వసూళ్లను కూడా కొల్లగొడుతూ ముందుకు సాగుతుంది. మరి ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాలో హీరోగా నటించిన విక్కీ కౌశల్ (Vicky Koushal) కనబరచడమే కాకుండా శంభాజీ మహారాజ్ అనే పాత్ర కనక ఇప్పుడు ఉంది ఉంటే ఈయన లానే ఉండేవాడేమో అనే రేంజ్ లో ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించి మెప్పించాడు. ఇక అలాంటి విక్కీ కౌశల్ ఈ పాత్రను చేయడానికి చాలా వరకు కష్టపడ్డారట. పొద్దున లేచి వ్యాయామం చేయడమే కాకుండా డైట్ మెయింటైన్ చేస్తూ ఆ ఫిజిక్ ని అలాగే కాపాడుకుంటూ ఫుడ్ నియమాలు పాటించడం శంభాజి గురించి చదివి తెలుసుకోవడం చేసేవాడట…

అలాగే గుర్రపు స్వారీ నేర్చుకోవడం శంభాజీ మహారాజ్ ఎలా ఉంటాడు ఆయన క్యారెక్టరైజేశన్ తెలుసుకొని దానికి సంబంధించిన నటనలో ఎప్పటికప్పుడు మేలుకువాలను తెలుసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చారట. దానివల్ల సినిమాలో ఆయన క్యారెక్టర్ చాలా అద్భుతంగా పేలింది.

ఇక ప్రతి సీన్ లో కూడా తన మార్క్ చూపించిన విక్కీ కౌశల్ నిజంగా నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. ఇక ఈ మధ్యకాలంలో విక్కీ కౌశల్ చేసిన సినిమాలు అతనికి మంచి గుర్తింపుని తీసుకొస్తున్నాయనే చెప్పాలి. నటనలో ఆయన ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. మరి ఈ సినిమా కోసం ఆయన పడిన కష్టం వృధా అవ్వలేదు. సినిమా ఫైనల్ గా సూపర్ సక్సెస్ గా నిలవడమే కాకుండా కొన ఊపిరితో కొట్టుకుంటున్న బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం ఒక్కసారిగా ఊపిరి పోసి పైకి లేపిందనే చెప్పాలి.

ఇక ఇప్పుడు విక్కీ కౌశల్ పేరు ఇండియా మొత్తం మారుమ్రోగిపోతుంది. అతనికి అభిమానుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. మరాఠా సామ్రాజ్యాధినేత అయిన శంభాజీ మహారాజ్ జీవిత కథను తెలుసుకోవడానికి చాలామంది ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఈ సినిమా వచ్చి ప్రతి ఒక్కరిని అలరిస్తూ ఉండడం విశేషం…