Chhaava
Chhaava : బాలీవుడ్ ఇండస్ట్రీకి గత కొన్ని రోజుల నుంచి సరైన సక్సెస్ అయితే రావడం లేదు. వచ్చిన సినిమాలు వచ్చినట్టుగా ప్లాప్ అవుతుంటే ఎలాంటి సినిమాలు చేయాలో తెలియక హీరోలు ఏ సినిమా పడితే ఆ సినిమా చేసేస్తున్నారు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి హీరో చేసిన సినిమాలు బోల్తా కొట్టడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ మీద ప్రతి ఒక్కరికి చిరాకు పుడుతుంది. అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలు మాత్రమే యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే జనవరి నెలలో వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ అయినప్పటికి ఫిబ్రవరిలో వచ్చిన ఛావా(Chaava) సినిమా మాత్రం మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతుంది. ఇక ఇప్పటివరకు సోనుసూద్ చేసిన ఫతే, అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్, కంగనా రనౌత్ ఎమర్జెన్సీ లాంటి సినిమాలు కొంత వరకు ఓకే అనిపించినప్పటికి భారీ సక్సెస్ లను మాత్రం దక్కడం లేదు. కానీ ఛావా సినిమాలతో బాలీవుడ్ ఇండస్ట్రీ మరోసారి సక్సెస్ ల బాట పట్టిందనే చెప్పాలి.
విక్కీ కౌశల్ (Vicky Koushal) శంబాజీ (Shambaji) మహారాజ్ గా కనిపించి తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఇక మొత్తానికైతే బాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సందర్భంగా ఈ సినిమా ఒక భారీ బుస్టాప్ ని ఇచ్చింది. ఇక ఈ సినిమా బాలీవుడ్ లో పలు రికార్డ్ లను కొల్లగొడుతూ ముందుకు సాగుతుంది…
ఇక ఈ సినిమాని చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రతి సీన్ కి గూజ్ బమ్స్ వచ్చే విధంగా ఉన్నాయి. ఎలివేషన్స్, ఎమోషన్స్ కి పెద్దపీట వేశారు కాబట్టే ఈ సినిమా సూపర్ సక్సెస్ గా నిలిచిందని చాలామంది చాలా రకాల కామెంట్లు అయితే చేస్తున్నారు. మొత్తానికైతే స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ ను చేసి ఒక అల్టిమేట్ సక్సెస్ ని సాధించారు.
‘ఛత్రపతి శివాజీ ‘ కొడుకు అయిన శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తరికెక్కిన ఈ సినిమా మరాఠా సామ్రాజ్యంలో ఆయన పాత్ర ఏంటో తెలియజేసింది. మొత్తానికైతే ఈ సినిమాతో బాలీవుడ్ ఊపిరి పీల్చుకుందనే చెప్పాలి. బాలీవుడ్ కి భారీ సక్సెస్ దక్కడం లేదు అనుకుంటున్న సందర్భంలో ఛావా సినిమా సూపర్ సక్సెస్ గా నిలిచి బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని అమాంతం టాప్ లెవల్ కి తీసుకెళ్ళిందనే చెప్పాలి…