Shankar
Shankar : సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి సందర్భంలోనే స్టార్ డైరెక్టర్ గా ఉన్న శంకర్ సైతం భారీ విజయాలను అందుకోవడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. గత పది సంవత్సరాల నుంచి ఆయనకు సరైన సక్సెస్ అయితే లేదు.ఆయన కథల విషయంలోనే చాలా వరకు పొరపాట్లు చేస్తున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి…
శంకర్ (Shankar) డైరెక్షన్ లో రామ్ చరణ్ (Ram Charan) హీరోగా వచ్చిన గేమ్ చేంజర్(Game Changer) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. కారణం ఏదైనా కూడా ఈ సినిమా ఫేలవ్వడంతో శంకర్ ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయిందనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన కమలహాసన్ తో ‘భారతీయుడు 3’ (Bharathiyudu 3) సినిమాని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారు. మరి బ్యాలెన్స్ ఉన్న షూట్ మొత్తాన్ని ఫినిష్ చేసి ఈ సినిమాని ఓటిటి లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ‘భారతీయుడు 2’ సినిమా భారీగా డిజాస్టర్ ని మూటగట్టుకుంది. దాని వల్ల వాళ్లకు భారీ లాస్ అయితే వచ్చింది. మరి ఆ లాస్ ని కవర్ చేయాలంటే ‘భారతీయుడు 3’ సినిమా కూడా చేయాలి. దాని ద్వారా వచ్చే డబ్బులతో ఆ లాస్ చాలా వరకు కవర్ అవుతుంది లేదంటే మాత్రం భారీగా నష్టాన్ని చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.
కాబట్టి శంకర్ కి ఈ సినిమా చేయడం పెద్దగా నచ్చనప్పటికి ఆ సినిమాను చేయాల్సి వస్తుందంటూ కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు మంచి విజయాలను సాధిస్తున్నారు. అలాగే దర్శకులు సైతం టాప్ రేంజ్ లో దూసుకెళ్తున్నారు. ఇంతవరకు ఎవ్వరూ చేయనటువంటి సబ్జెక్టులతో సినిమాలను చేస్తూ ముందుకు సాగిన శంకర్ మాత్రం ఇప్పుడు డీలా పడిపోతున్నాడు.
కారణం ఏంటి అంటే యంగ్ డైరెక్టర్లు సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటే పాన్ ఇండియా సినిమా చేసిన దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న శంకర్ మాత్రం ఇంకా రోజురోజుకీ భారీ డిజాస్టర్లను మూటగట్టుకుంటూ తన ఇమేజ్ ను పూర్తిగా డ్యామేజ్ చేసుకుంటున్నాడు…ఇక భారతీయుడు 3 సినిమాని ప్రముఖ ఓటిటి సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే బిజినెస్ డీల్ కూడా కుదిరిందని వార్తలైతే వినిపిస్తున్నాయి.
మరి ఈ సినిమాని వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి చాలా తొందరగా ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ అయితే ప్రణాళిక లను రూపొందించుకుంటున్నారట. చూడాలి మరి ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది… ఒకవేళ ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే కనక శంకర్ కి మరోసారి మంచి ఇమేజ్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. లేకపోతే మాత్రం శంకర్ ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి రిటైర్మెంట్ అవ్వడమే బెస్ట్ అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి…