PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు నేడు రానున్నారు. ఆయనకు స్వాగతం చెప్పేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రెడీ అయిపోయారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రధాని షెడ్యూల్ ను పర్యవేక్షించే పనులు ప్రసార శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అప్పగించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా మూడు రోజులుగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీనికి ఇప్పటికే సీఎం కేసీఆర్ గురువారం నాటి కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. దీంతో ప్రతి రోజూ దైవ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీనికి ప్రధాని కూడా హాజరు కావడంతో కార్యక్రమ ప్రతిష్ట మరోమారు పెరగనుంది.
ప్రధాని పర్యటనలో భాగంగా శనివారం ఇక్రిశాట్ కు చేరుకుని అనంతరం ముచ్చింతల్ ఆశ్రమానికి చేరుకుంటారు. ఆయన వెంట కేసీఆర్ ఉండనున్నారు. ప్రధానితో పాటు మంత్రులు తోమర్, కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై ఉండనున్నారు. ప్రధాని తిరుగు ప్రయాణం వరకు కూడా కేసీఆర్ ప్రధానితోపాటు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రధాని కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుని ఆయనకు సహకరించేందుకు అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే సీఎస్ సోమేశ్ కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆశ్రమంలో రామానుజాచార్య విగ్రహం, యాగశాలలను ప్రారంభించనున్నారు.
Also Read: Modi vs KCR : ప్రధాని మోడీతో కేసీఆర్ కు సంధి లేదు.. సమరమే.. రుజువు ఇదిగో!
సమతా స్ఫూర్తి కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ మూడు గంటల పాటు గడపనున్నారు. కార్యక్రమ విశిష్టతను తెలుసుకోనున్నారు. ఆధ్యాత్మిక చింతనతో ప్రధాని ఆశ్రమంలో గడుపుతూ ప్రశాంతంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రామానుజ వైభవాన్ని చినజీయర్ స్వామి ప్రధానికి వివరించనున్నారు. ఆశ్రమంలోజరిగే అన్ని విషయాలపై తెలుసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే కార్యక్రమం ఖరారు అయినందున దాని ప్రకారమే ప్రధాని తన పర్యటన ముగించనున్నట్లు తెలుస్తోంది.
ప్రధాని పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటున్నారు. ఆయన వచ్చిన దగ్గర నుంచి వెళ్లే వరకు ఎక్కడికి ఎప్పుడు వెళ్లాలనే దానిపై ఇప్పటికే స్పష్టత ఉండటంతో ప్రధాని పర్యటనను సజావుగా సాగేందుకు సీఎం అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిపై సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసిందే. ఇక విమానాశ్రయం నుంచి స్వాగతం పలికే కార్యక్రమం నుంచి ఆయన తిరిగి వెళ్లే వరకు ప్రతి విషయంలో తేడా రాకుండా చూసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
Also Read: Narendra Modi: అవినీతి అంతంపై ప్రధానివి మాటలేనా.. చేతలు లేవా