Vijay Devakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ లైగర్ ’. పెళ్లి చూపులు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్… అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుండగా… పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. అయితే ఇటీవల బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా విజయ్ అభిమానులకి ఓ సర్ ప్రైజ్ అప్డేట్ ఇచ్చింది చార్మి.
‘లైగర్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోందని… మునుపెన్నడూ చేయని విధంగా మాస్ డ్యాన్స్‌తో ఇరగదీస్తున్నాడని వెల్లడించింది ఛార్మి. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది ఈ భామ. సినిమాలోని ఆ పాట చిత్రీకరణలో విజయ్ ఎనర్జీ చూసి ఈ పోస్ట్ పెడుతున్నట్లు ఛార్మి తెలిపింది. పూరి జగన్నాథ్, చార్మి, కరణ్ జోహార్, అపూర్వా మెహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
#LIGER song shoot in mumbai , and trust me , @TheDeverakonda is dancing like never before., expect a full massy crazy feast 😉
PS – this tweet is due to the adrenaline rush I m having rite now watching this hottie ‘s energy 😍@PuriConnects @DharmaMovies pic.twitter.com/Mxm10O8KSv
— Charmme Kaur (@Charmmeofficial) October 25, 2021
సినిమా ప్రీ క్లైమాక్స్ లో మైక్ టైసన్ ఎంట్రీ ఇస్తారని… టైసన్ వచ్చిన తర్వాత సినిమా మరో రేంజ్ కు వెళ్తుందని అంటున్నారు. విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ పై వచ్చే ఎపిసోడ్స్ కూడా గోవాలోనే చిత్రీకరించబోతున్నట్టు సమాచారం. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న రమ్యకృష్ణ, మక్రంద్ దేశ్ పాండే వంటి ప్రముఖులు నటిస్తున్నారు. ప్రస్తుతం ఛార్మి చేసిన పోస్ట్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.