Boxoffice: ప్రేక్షకులను అలరించడానికి ముఖ్యంగా నేటి జనరేషన్ అభిరుచులకు తగ్గట్టు, అప్ డేట్ అవుతూ.. కొత్త కంటెంట్ తో పాటు ట్రెండింగ్ కంటెంట్ తో ఓటీటీ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో కూడా కొన్ని సినిమాలు థియేటర్ రిలీజ్ కోసం చాలా కాలం ఎదురు చూసి రిలీజ్ కి సిద్ధం అయ్యాయి. అయితే, ఈ వారం థియేటర్స్ లో రిలీజవుతున్న చిత్రాలు కూడా అలాంటి చిత్రాల కోవలోకే వస్తాయి.

‘రొమాంటిక్’, ‘వరుడు కావలెను’ లాంటి చిత్రాలు ఓటీటీ ఆఫర్లను కాదు అనుకుని థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. మరి బాక్సాఫీస్ దగ్గర ఆయా సినిమాల పరిస్థితి ఏమిటో చూద్దాం. ముందుగా ‘రొమాంటిక్’ సంగతి చూస్తే.. ఆకాష్ పూరి, కేతికా శర్మ జంటగా అనిల్ పాడూరి తెరకెక్కించిన ఈ చిత్రం పై బీ. సీ సెంటర్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఈనెల 29న థియేటర్లలో విడుదల కానుంది.

పూరి స్క్రిప్ట్ రాశాడు, పైగా కమర్షియల్ అంశాలకు మంచి స్కోప్ ఉన్న సినిమా. అందుకే ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక కూల్ హీరో నాగశౌర్య ‘వరుడు కావలెను’ అంటూ ఫీల్‌గుడ్ మూవీతో వస్తున్నాడు. నాగశౌర్య-రీతూవర్మ జంటగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ బాగా జనాన్ని ఆకట్టుకుంది. ఈ సినిమా కూడా అక్టోబరు 29న థియేటర్లలో విడుదల కానుంది.

ఇక ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది మల్టీప్లెక్స్ ల్లో కూడా ఫేవరేట్ సినిమా అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రెండు సినిమాలతో పాటు ‘తీరం’ అనే మరో చిన్న సినిమా కూడా రిలీజ్ కి రెడీ అయింది. అనిల్ ఇనమడుగు కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ చిత్రం పై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. కనీసం ఈ సినిమా గురించి చాలామందికి తెలియదు.
కాబట్టి.. ఈ సినిమా హిట్ అవ్వడం కష్టమే. అలాగే బాక్సాఫీస్ వద్ద కనీస కలెక్షన్స్ కూడా ఈ సినిమాకి వచ్చేలా లేవు. ఈ సినిమా కూడా 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘రావణ లంక’ అనే మరో సినిమా కూడా అక్టోబరు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిష్ బండిపల్లి, అస్మిత కౌర్ జంటగా నటించిన ఈ చిత్రం హిట్ అవ్వడం అసాధ్యమే.