TDP- Janasena: ఆంధ్రప్రదేశ్ లో నిన్న జరిగిన జనసేన ఆవిర్భావ సభతో పవన్ కల్యాణ్ తో బీజేపీతో పొత్తుకు సై అనే సంకేతాలు ఇచ్చారు. దీంతో బీజేపీ నేతల్లో జోష్ పెరిగింది. ఇక రోడ్ మ్యాప్ ఖరారైతే వైసీపీని ఢీకొనడమే లక్ష్యంగా ముందుకు కదలనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరోమారు రాజకీయ పరిణామాలు మారనున్నాయి. కానీ ప్రతిపక్షాలు అన్ని ఒకటయ్యే అవకాశాలుండటంతో టీడీపీ పరిస్థితి ఏంటనే ప్రశ్న అందరిలో వస్తోంది. దీంతో బీజేపీ ఆదేశాల కోసమే జనసేన ఎదురుచూస్తోంది. రాష్ట్రంలో అధికారం కోసం తాపత్రయపడుతోంది.

నిన్న జరిగిన సభలో పవన్ కల్యాణ్ లో ఆ కసి కనిపించింది. వైసీపీ చేష్టలను ఖండించారు. వారి విధానాలు తూర్పారబట్టారు. రాబోయే ఎన్నికల్లో తమదే అధికారం అని గుర్తు చేశారు. ఈ క్రమంలో ఏపీలో రాబోయే రోజుల్లో మరిన్ని వైవిధ్యాలు చోటుచేసుకునే వీలుందని తెలుస్తోంది. బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే ఇక దాన్ని అనుసరిస్తానని పవన్ కల్యాణ్ చెప్పడంతో బీజేపీ, జనసేన మైత్రి కొనసాగుతుందని తెలుస్తోంది.
రాబోయే ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలపై కసరత్తు కొనసాగుతోంది. తిరుపతి పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు దీంతో రాబోయే రోజుల్లో బీజేపీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. జనసేనతో కలిసి ఉద్యమాలు చేసి వైసీపీని మట్టి కరిపించాలనే ఆలోచనలో ఉంది. ఇందుకు గాను ఇప్పటికే వ్యూహాలు రెడీ చేస్తున్నారు.

వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకు పక్కా ప్రణాళిక ఖరారు చేస్తున్నారు. దీనికి గాను బీజేపీ ఇప్పటికే పలు రకాలుగా ప్లాన్లు వేస్తోంది. ప్రాంతీయ పార్టీలను తుదముట్టించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే తెలంగాణలో కూడా టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే హుజురాబాద్, దుబ్బాక, జీహెచ్ ఎంసీ లాంటి చోట్ల టీఆర్ఎస్ కు ఎదురు నిలిచి సవాలు చేయడంతో టీఆర్ఎస్ సైతం బీజేపీనే టార్గెల్ చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ పక్కా ప్రణాళిక రచించి అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తోంది.
[…] […]