https://oktelugu.com/

RC15: శంకర్​ సినిమా కోసం చరణ్ కొత్త లుక్​.. నెట్టింట్లో పిక్స్ వైరల్​

RC15: మెగాపవర్​స్టార్ రామ్​చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఆర్​ఆర్​ఆర్​. ఇందులో చెర్రితో పాటు ఎన్టీఆర్​ కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, ప్రోమోలు మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాయి . ఇదిలా ఉండగా, మరోవైపు మెగాపవర్​ స్టార్​ రామ్​చరణ్ హీరోగా.. దర్శకుడు శంకర్​ ఓ భారీ పాన్​ ఇండియా సినిమాకు తెరలేపారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్​ షెడ్యూల్​ కూడా మొదలైంది. ఇందులో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 24, 2021 / 11:29 AM IST
    Follow us on

    RC15: మెగాపవర్​స్టార్ రామ్​చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఆర్​ఆర్​ఆర్​. ఇందులో చెర్రితో పాటు ఎన్టీఆర్​ కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, ప్రోమోలు మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాయి . ఇదిలా ఉండగా, మరోవైపు మెగాపవర్​ స్టార్​ రామ్​చరణ్ హీరోగా.. దర్శకుడు శంకర్​ ఓ భారీ పాన్​ ఇండియా సినిమాకు తెరలేపారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్​ షెడ్యూల్​ కూడా మొదలైంది. ఇందులో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు రెండో షెడ్యూల్​ కూడా ప్రారంభమైంది.

    Ramcharan

    Also Read: చెర్రీతో అదిరే యాక్షన్​ సీన్స్​ ప్లాన్​ చేస్తున్న శంకర్​

    కాగా, ఈ సినిమాలో రామ్​చరణ్ లుక్​కు సంబంధించి ప్రస్తుతం హాట్​ టాపిక్​గా మారింది. ఇప్పటికే ఈ సినిమాలోని ఫైట్స్​కు సంబంధించిన ఫొటోలు కొన్ని వైరల్​ కాగా.. ఇప్పుడు చరణ్​ లుక్​కు సంబంధించిన ఫొటోలను నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.  ఇందులో చెర్రి మళ్లీ ఆరెంజ్​ సినిమా లాంటి స్టైలిష్​ లుక్​లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. మరి ఇది సినిమాకు సంబంధించిందా లేక.. నార్మల్​గానే అలా ఉన్నారా తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్​గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తుండగా.. దిల్​రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

    మరోవైపు రోబోతో భారీ హిట్​ కొట్టిన శంకర్​. ఆతర్వాత వచ్చిన ఐ, రోబో2.0 సినిమాలు భారీ డిజాస్టర్​ను మూటకట్టుకున్నాయి. దీంతో శంకర్​- చెర్రి కాంబినేషన్​లో వచ్చే సినిమా ఎలా ఉండబోతోందనే విషయంపై అనేక ఊహాగానాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మరోవైపు, రామ్​చరణ్ ఆర్​ఆర్​ఆర్​తో సంక్రాంతికి పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాతో పాన్​ఇండియా హీరోగా చెర్రి మారడం ఖాయం.

    Also Read: రామ్​చరణ్​ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్​బాస్​ కంటెస్టెంట్స్​!