Homeజాతీయ వార్తలుKCR : కేసీఆర్.. నిరుద్యోగుల నమ్మకాన్ని కోల్పోయారా?

KCR : కేసీఆర్.. నిరుద్యోగుల నమ్మకాన్ని కోల్పోయారా?

KCR : తెలంగాణ ఉద్యమం పుట్టుకకు ప్రధానమైన కారణాల్లో ఉద్యోగాలు కూడా ఒకటి. మరి, రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా? వేయాల్సినన్ని నోటిఫికేషన్లు ప్రభుత్వం వేసిందా? అంటే.. లేదు అనే సమాధానమే వస్తుంది. సొంత రాష్ట్రంలో సర్కారు కొలువు సాధించాలని లక్షలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ.. ప్రభుత్వం మాత్రం వారి ఆకాంక్షలపై ఎప్పటికప్పుడు నీళ్లు చల్లుతూనే వస్తోంది. చివరకు.. ఉద్యోగ నోటిఫికేషన్ల అంశం ఎన్నికలు గట్టెక్కడానికి వాడుకునే హామీలా మారిపోయిందనే విమర్శలు తీవ్రంగానే వినిపిస్తున్నాయి.

Also Read: వరి ఎఫెక్ట్: ఢిల్లీలో కేసీఆర్ కు షాకుల మీద షాకులు

KCR
KCR

రెండు వారాల క్రితం కూడా.. ముఖ్య మంత్రి మరోసారి ఉద్యోగాల గురించి మాట్లాడారు. ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం తర్వాత.. నోటిఫికేషన్లు వరస కడతాయని చెప్పుకొచ్చారు. ఇదంతా.. రెండు మూడు రోజుల్లోనే జరిగిపోతుందన్నారు. కానీ.. ఇప్పటి దాకా ఉద్యోగ సంఘాలతో సమావేశమే కాలేదు. నోటిఫికేషన్ల గురించిన చర్చ కూడా బందై పోయింది. దీంతో.. నిరుద్యోగుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోందనే చర్చ మొదలైంది.

ఉద్యోగ నోటిఫికేషన్ల విషయం.. కేవలం ఎన్నికల స్టంట్ గా మారిపోయిందని అంటున్నారు. ఎన్నికల ముందు హడావుడి చేయడం.. ఆ తర్వాత మరిచిపోవడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని మండి పడుతున్నారు. ఇప్పుడు కూడా మరోసారి మోసపోయామని నిరుద్యోగులు భావిస్తున్నారట. నోటిఫికేషన్లు రావట్లేదని ప్రాణాలు తీసుకుంటున్నా.. సర్కారులో చలనం లేదని మండి పడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాష్ట్రంలో సూమారు 8 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆర్థిక శాఖ సేకరించిన లెక్కల ప్రకారం 67,820 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పోస్టులను భర్తీ చేయడానికి ఎందుకు కాలయాపన చేస్తున్నారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. అయితే.. ప్రస్తుతం ఆర్డర్‌ టు సర్వ్‌ కింద పనిచేస్తున్న ఉద్యోగులను కొత్త జిల్లాలకు కేటాయించేందుకు చూస్తున్నారట. వారికి ఆప్షన్లు ఇచ్చే ప్రక్రియను వచ్చే నెలలో మొదలు పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇదంతా ఆయ్యాక.. అప్పుడు నోటిఫికేషన్ల గురించి ఆలోచిస్తారనే చర్చ కూడా సాగుతోంది. ఇది పూర్తికావడానికి.. వచ్చే ఏడాది తొలి సగం పూర్తి కావొచ్చని అంటున్నారు.

అప్పటి వరకు నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పనట్టేనా? అనే చర్చ సాగుతోంది. అదే జరిగి, కాలయాపన కొనసాగితే.. కేసీఆర్ నిరుద్యోగుల నమ్మకాన్ని కోల్పోయినట్టేనా? అనే డిబేట్ కూడా సాగుతోంది. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.

Also Read: ఢిల్లీకి కేసీఆర్.. తేల్చుకునే వస్తామని సవాల్

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version