BJP: ఆంధ్రప్రదేశ్ లోని కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు తుపాను ధాటికి అతలాకుతలం అయ్యాయి. పంటలు నాశనం అయిపోయాయి. వరద బీభత్సం పోటెత్తింది. ఫలితంగా ప్రజలు కట్టు బట్టలతో ఇళ్లు విడిచి బతుకు జీవుడా అంటూ పరుగులు పెట్టారు. ఇంతటి విపత్తు ఎప్పుడు చూడలేదని వాపోయారు. తినడానికి తిండి లేకుండా తాగడానికి నీళ్లు లేకుండా అన్నమో రామచంద్రా అంటూ పెట్టే బేడ నెత్తిన పెట్టుకుని ఉన్న ఊరును వదిలి ప్రాణాలు కాపాడుకునేందుకు తరలి వెళ్తున్నారు.

దీంతో వరద బీభత్సంపై స్పందించిన బీజేపీ నేతలు వారి సహాయార్థం విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. ఈ నెల 25, 26 తేదీల్లో విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ర్ట వ్యాప్తంగా జోలె పట్టి వసూలు చేసిన బట్టలు, నగదు, వస్తువులు వరద బాధితులకు అందజేయనున్నారు. దీని కోసం తెలంగాణ బీజేపీ నేతలు కూడా స్పందిస్తున్నారు. సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. విపత్తు సమయంలో అందరిలో ఐకమత్యం ఉండాలని చెబుతున్నారు.
ఏపీ అయినా తెలంగాణ అయినా బాధలో ఉన్నప్పుడు ఓదార్పు అవసరం. దీని కోసం నేతలందరు సమష్టిగా సహకారం అందించేందుకు రెడీ అయ్యారు. ప్రాంతీయ విభేదాలు పక్కన పెట్టి ప్రజల సమస్యలు తీర్చేందుకు ముందుకు కదలనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈనెల 26న జరగాల్సిన బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సమావేశం కూడా వాయిదా వేయనున్నట్లు సమాచారం.
Also Read: Mudragada Padbanabham: ముద్రగడ తీరు పవన్, చంద్రబాబుకు వ్యతిరేకంగానేనా..?
ప్రజల బాధలు చూసి అందరు చలించిపోతున్నారు. సాటి వారి కష్టాలను చూస్తే గుండె తరుక్కుపోతోందని చెబుతున్నారు. బరువెక్కిన హృదయాలకు భరోసా కల్పించేందుకు అందరు తమ వంతు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో వరద బాధితులకు కొంతైనా ఉపశమనం లభిస్తుందని అందరం ఆశిద్దాం.
Also Read: India -Pakistan war in 1971: భారత్ -పాక్ యుద్ధం..: 1971 డిసెంబర్ నెలలో ఏం జరిగింది..?